లేట్ రిప్లయ్.. లెట్స్ బ్రేకప్
దిశ, వెబ్‌డెస్క్: వాట్సాప్ తీసుకున్న ‘ప్రైవసీ పాలసీ’ నిర్ణయం.. ఆ సంస్థకు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడం, వ్యక్తిగత సమాచారాన్ని ఎలా పంచుకుంటారని వినియోగదారులు నిలదీయడంతో పాటు యూజర్లు వాట్సాప్ డిలీట్ చేసి, సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ప్రత్యామ్నాయ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. దాంతో దిగొచ్చిన వాట్సాప్.. అందరివీ కాదని, బిజినెస్ ఖాతాల సమాచారాన్ని మాత్రమే పంచుకుంటామని వివరణ ఇచ్చింది. అయినప్పటికీ విమర్శలు తగ్గలేదు. దీంతో ప్రైవసీ పాలసీపై వెనక్కి తగ్గిన వాట్సాప్.. నిర్ణయాన్ని […]
దిశ, వెబ్‌డెస్క్: వాట్సాప్ తీసుకున్న ‘ప్రైవసీ పాలసీ’ నిర్ణయం.. ఆ సంస్థకు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడం, వ్యక్తిగత సమాచారాన్ని ఎలా పంచుకుంటారని వినియోగదారులు నిలదీయడంతో పాటు యూజర్లు వాట్సాప్ డిలీట్ చేసి, సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ప్రత్యామ్నాయ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. దాంతో దిగొచ్చిన వాట్సాప్.. అందరివీ కాదని, బిజినెస్ ఖాతాల సమాచారాన్ని మాత్రమే పంచుకుంటామని వివరణ ఇచ్చింది. అయినప్పటికీ విమర్శలు తగ్గలేదు. దీంతో ప్రైవసీ పాలసీపై వెనక్కి తగ్గిన వాట్సాప్.. నిర్ణయాన్ని మూడు నెలలపాటు వాయిదా వేసింది. దాంతో నెటిజన్లు, మీమర్స్.. ఇట్స్ టూ లేట్ అంటూ మరోసారి వాట్సాప్‌ను ట్రోలింగ్ చేయడంతో పాటు జోకులు పేలుస్తున్నారు.
‘వాట్సాప్‌లో ఇలా మెసేజ్ ఇవ్వగానే అలా రిప్లయ్ వస్తుంది. అలాంటిది మీ నిర్ణయంపై రెండు రోజులు గడువు తీసుకోవడం వల్ల చాలా ఆలస్యమైంది. నేను రిప్లయ్ రెండు రోజుల తర్వాత కోరుకుంటే.. పావురంతో కబురు పంపేవాడిని’ వాట్సాప్ బాగా లేట్ చేసింది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా, ‘నేను నీకు అర్ధరాత్రి 2.38 నిమిషాలకు ఐ లవ్ యూ చెప్పాను, నువ్వు నాకు 2.40 నిముషాలకు రిప్లయ్ ఇచ్చావ్. 2.39 నిమిషాలకు నువ్వేం చేశావ్. లెట్స్ బ్రేకప్’ అని మరో నెటిజన్ వాట్సాప్ లేటు స్పందనపై కౌంటర్ వేశాడు. ఈ క్రమంలోనే ఎంతోమంది నెటిజన్లు, మీమర్స్ ‘స్వీట్లు పంచాల్సిందే వాట్సాప్ దిగొచ్చింది’, ‘క్యా హువా.. డర్ గయా.. వాట్సాప్ డర్ గయా’, ‘చిన్నబుచ్చుకోవద్దు, నేషనల్ లెవల్ చాంపియన్‌లో ఓడిపోయావు నువ్వు, మీ డ్రామాను నేను గౌరవిస్తున్నాను’ అంటూ కామెంట్లు చేశారు.