దేశరాజధానిలో నైట్ కర్ఫ్యూ
న్యూఢిల్లీ: కరోనాను కట్టడి చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించింది. ఢిల్లీలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెలాఖరు వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పేర్కొంది. సెకండ్ వేవ్ మొదలైన తర్వాత కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న కఠిన ఆంక్షలు ఇవే కావడం గమనార్హం. ఢిల్లీలో తాజాగా 3,548 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే మహారాష్ట్ర, రాజస్తాన్, […]
న్యూఢిల్లీ: కరోనాను కట్టడి చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించింది. ఢిల్లీలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెలాఖరు వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పేర్కొంది. సెకండ్ వేవ్ మొదలైన తర్వాత కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న కఠిన ఆంక్షలు ఇవే కావడం గమనార్హం. ఢిల్లీలో తాజాగా 3,548 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే మహారాష్ట్ర, రాజస్తాన్, ఒడిశా, గుజరాత్‌లు నైట్ కర్ఫ్యూ నిబంధనలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.