Sri Lanka Artist: శ్రీలంక ఆర్టిస్ట్ చేతిలో.. మిస్ దివా యూనివర్స్ ‘డాళ్’
దిశ, ఫీచర్స్ : మిస్ యూనివర్స్ 2020 కిరీటాన్ని మెక్సికో భామ ఆండ్రియా మెజా దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ పోటీలో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించిన మిస్ ఇండియా 24 ఏళ్ల అడెలిన్ కాస్టెలినో టాప్ 4లో నిలిచింది. మిస్ దివా యూనివర్స్ 2020 టైటిల్ గెలుచుకున్న కాస్టెలినో, మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకోనప్పటికీ భారతీయుల హృదయాలను కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో ఈ అందాల భామను పోలిన ఓ సూపర్ మోడల్ డాల్‌ను శ్రీలంకకు చెందిన […]
దిశ, ఫీచర్స్ : మిస్ యూనివర్స్ 2020 కిరీటాన్ని మెక్సికో భామ ఆండ్రియా మెజా దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ పోటీలో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించిన మిస్ ఇండియా 24 ఏళ్ల అడెలిన్ కాస్టెలినో టాప్ 4లో నిలిచింది. మిస్ దివా యూనివర్స్ 2020 టైటిల్ గెలుచుకున్న కాస్టెలినో, మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకోనప్పటికీ భారతీయుల హృదయాలను కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో ఈ అందాల భామను పోలిన ఓ సూపర్ మోడల్ డాల్‌ను శ్రీలంకకు చెందిన ఓ కళాకారుడు రూపొందించాడు.
మిస్ యూనివర్స్ పోటీల్లో 74 మంది అమ్మాయిలతో పోటీ పడి మూడో రన్నరప్‌గా నిలిచిన భారత మోడల్ అడెలిన్ కాస్టెలినో సాధించిన విజయానికి గానూ, శ్రీలంక ఆర్టిస్ట్ అచ్చం ఆమె లాంటి బొమ్మను తయారుచేశాడు. ఆ పోటీల్లో కాస్టెలినో పింక్ శారీ ధరించగా, అదే రంగులో తన బొమ్మను మలిచి ఔరా అనిపించాడు. ఈ సూపర్ గ్లామర్ డాల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లోని ‘నైగీడాల్స్’ అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ.. ‘ఈ కాస్ట్యూమ్ భారతీయ మహిళను గుర్తుచేస్తోంది.
ఈ శారీ సంప్రదాయకమైంది. ఇది మొత్తం దేశాన్ని ఐక్యం చేస్తుంది. దీని రంగు జాతీయ పుష్పాన్ని గుర్తుచేస్తోంది’ అంటూ ఆ ఆర్టిస్ట్ రాసుకొచ్చాడు. ఈ పోస్టును అడెలిన్ కాస్టెలినో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రీ-షేర్ చేయడంతో పాటు, తన బొమ్మను చేసినందుకు థాంక్స్ చెప్పింది. అడెలిన్ కాస్టెలినో పుట్టింది కువైట్‌లో కానీ 15 ఏళ్ల వయసు నుంచి ముంబైలోనే నివాసం ఉంటోంది. కాస్టెలినో తల్లిదండ్రులు కర్ణాటకలోని ఉడిపికి చెందినవారు.