బ్రేకింగ్.. సచివాలయం ముట్టడికి ఉద్యోగ సంఘాల ప్రయత్నం

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన, బదిలీలు జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వం ఎలాంటి స్పష్టత లేకుండా బదిలీల ప్రక్రియ జరుపుతోందని తెలంగాణ ఎంప్లాయిస్ యూనియన్ సోమవారం సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. ఉద్యోగ సంఘాల ముట్టడి నేపథ్యంలో బీఆర్కేఆర్ భవన్ చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా సచివాలయానికి వచ్చిన ఉద్యోగ సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులకు, […]

Update: 2021-12-27 03:39 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన, బదిలీలు జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వం ఎలాంటి స్పష్టత లేకుండా బదిలీల ప్రక్రియ జరుపుతోందని తెలంగాణ ఎంప్లాయిస్ యూనియన్ సోమవారం సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. ఉద్యోగ సంఘాల ముట్టడి నేపథ్యంలో బీఆర్కేఆర్ భవన్ చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు.

ఈ సందర్భంగా సచివాలయానికి వచ్చిన ఉద్యోగ సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. అనంతంరం పోలీసులు వారిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. ఇందులో యూనియన్ అధ్యక్షుడు చిరగాని సంపత్ కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి డా. పురుషోత్తం, మహిళా అధ్యక్షురాలు నిర్మల తదితరులు ఉన్నారు.

 

Tags:    

Similar News