రేవంత్‌ను కలవకుండా.. కాంగ్రెస్ నేతల అరెస్ట్
దిశ, మేడ్చల్: మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్‌ను కాంగ్రెస్ నేతలు కలుసుకోకుండా ఉండేందుకు ముందస్తుగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ఓబీసీ సెల్ వైస్ చైర్మన్ తోట వజ్రేష్ యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేసి మేడిపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అలాగే చర్లపల్లి జైలు నుంచి విడుదలవుతున్న రేవంత్‌కు స్వాగతం పలికేందుకు వెళ్తున్నారనే సమాచారంతో పోలీసులు నాగారం మున్సిపాలిటీలో పలువురు కాంగ్రెస్ నాయకులను […]
దిశ, మేడ్చల్: మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్‌ను కాంగ్రెస్ నేతలు కలుసుకోకుండా ఉండేందుకు ముందస్తుగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ఓబీసీ సెల్ వైస్ చైర్మన్ తోట వజ్రేష్ యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేసి మేడిపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అలాగే చర్లపల్లి జైలు నుంచి విడుదలవుతున్న రేవంత్‌కు స్వాగతం పలికేందుకు వెళ్తున్నారనే సమాచారంతో పోలీసులు నాగారం మున్సిపాలిటీలో పలువురు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేశారు. నాగారం నుంచి బయలుదేరిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని కీసర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో మేడ్చల్ జిల్లా మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ర్యాల అశోక్ యాదవ్, కోళ్ల కృష్ణయాదవ్, పంగా సంతోష్, పంగా బాయి నర్సింగ్ తదితరులు ఉన్నారు.
Tags: Congress leaders, Arrest, revanth reddy release, police, Municipality of Nagaram