థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు షురూ

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ల సంఖ్యను భారీగా పెంచేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ వరసగా నిర్వహిస్తున్న సమావేశంలో కొత్తగా 20వేల బెడ్లను ఏర్పాట్లను చేయాలని ఆలోచనలు చేస్తున్నారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా 3వేల బెడ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అవసరమైన ఆసుప్రతిలో అదనపు భవనాలను, ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 15,339 బెడ్లు అందుబాటులో ఉండగా థర్డ్ వేవ్ మొదలైతే ఎదుర్కొనేందుకు కావల్సిన […]

Update: 2021-08-08 20:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ల సంఖ్యను భారీగా పెంచేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ వరసగా నిర్వహిస్తున్న సమావేశంలో కొత్తగా 20వేల బెడ్లను ఏర్పాట్లను చేయాలని ఆలోచనలు చేస్తున్నారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా 3వేల బెడ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అవసరమైన ఆసుప్రతిలో అదనపు భవనాలను, ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 15,339 బెడ్లు అందుబాటులో ఉండగా థర్డ్ వేవ్ మొదలైతే ఎదుర్కొనేందుకు కావల్సిన బెడ్లను ఏర్పాటు చేస్తున్నారు.

కొత్తగా 20వేల బెడ్ల ఏర్పాటు

సెకండ్ వేవ్‌లో ఎదురైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని థర్డ్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. గతంలో బెడ్లు దొరకక, ఆక్సిజన్ అందుబాటులో లేక పేషెంట్లు చనిపోయిన పరిస్థితులను మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు తగిన చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనరల్ బెడ్లు 5,526, ఆక్సిజన్ బెడ్లు 7,670, ఐసీయూ 2,143 మొత్తం 15,339 బెడ్ల ఉన్నాయి. థర్డ్ వేవ్ ప్రబలితే ఈ బెడ్లు ఏ మాత్రం సరిపోవని భావించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి గాంధీ, టిమ్స్, కింగ్ ఆసుపత్రుల వరకు వివిధ క్యాటగిరీలలోని ఆసుపత్రుల్లో కొత్తగా 20వేల వరకు బెడ్లను ఏర్పాటు చేసేందుకు ఆలోచనలు చేస్తున్నారు.

నిలోఫర్, గాంధీ ఆసుపత్రితో పాటు ఇతర జిల్లాలో అవసరమైన చోట పిడియాట్రిక్ కోసమే ప్రత్యేకంగా 3 వేల బెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశాలు నిర్వహించిన ఏర్పాట్లకు సంబంధించి పలు ఆదేశాలు జారీ చేశారు.

అదనపు భవనాలు, ఆక్సిజన్ ప్లాంట్లు

ఆసుపత్రిలో బెడ్ల సంఖ్య పెంచనుండటంతో అవసరమైన చోట అదనపు గదుల నిర్మాణాలు చేపట్టారు. గతంలో కేసులు ఎక్కువగా వచ్చిన జిల్లాలో, ఆసుపత్రిలోని బెడ్లు ఫుల్ అయిన ఆసుపత్రుల్లో అదనపు గదుల నిర్మాణాలు చేపట్టారు. ప్రతి బెడ్ కు ఆక్సిజన్ సదుపాయం అందించేందుకు ఆక్సిజన్ ప్లాంట్లను కూడా నూతనంగా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులకు ఆక్సిజన్ కొరత లేకుండా ఉండేందుకు పిడియాట్రిక్ ఆక్సిజన్ ప్లాంట్లపై ఫోకస్ చేస్తున్నారు. వీటితో పాటు సిబ్బంది కొరత లేకుండా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపట్టారు.

Tags:    

Similar News