నౌకను తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు
దిశ, ఏపీ బ్యూరో: విశాఖ తెన్నేటి పార్క్ సముద్ర తీరానికి బంగ్లాదేశ్‌కు చెందిన మర్చంట్ వెసల్ నౌక కొట్టుకువచ్చిన విషయం తెలిసిందే. ఆ నౌకను తిరిగి సముద్రంలోకి తీసుకెళ్లేందుకు అధికారులు ప్రైవేట్ ఏజెన్సీలకు టెండర్లను పిలిచారు. నౌకలో 40 టన్నుల ఇంధనం ఉంది. ఆ ఇంధనాన్ని బయటికి తీసిన తర్వాత నౌకను సముద్రంలోకి పంపనున్నారు. రివర్స్ పంపింగ్ విధానం ద్వారా సముద్రంలోకి నౌకను తీసుకెళ్లేందుకు లోకల్ ఏజెంటు, పీఐ క్లబ్, డీజీ షిప్పింగ్, ఇండియన్ కోస్ట్‌గార్డ్, కలెక్టర్, […]
దిశ, ఏపీ బ్యూరో: విశాఖ తెన్నేటి పార్క్ సముద్ర తీరానికి బంగ్లాదేశ్‌కు చెందిన మర్చంట్ వెసల్ నౌక కొట్టుకువచ్చిన విషయం తెలిసిందే. ఆ నౌకను తిరిగి సముద్రంలోకి తీసుకెళ్లేందుకు అధికారులు ప్రైవేట్ ఏజెన్సీలకు టెండర్లను పిలిచారు. నౌకలో 40 టన్నుల ఇంధనం ఉంది. ఆ ఇంధనాన్ని బయటికి తీసిన తర్వాత నౌకను సముద్రంలోకి పంపనున్నారు. రివర్స్ పంపింగ్ విధానం ద్వారా సముద్రంలోకి నౌకను తీసుకెళ్లేందుకు లోకల్ ఏజెంటు, పీఐ క్లబ్, డీజీ షిప్పింగ్, ఇండియన్ కోస్ట్‌గార్డ్, కలెక్టర్, సెక్యూరిటీ గార్డులతో నౌక యజమాని సమన్వయం కుదుర్చుకున్నారు.