ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ఏకే గోస్వామి

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అరూప్ కుమార్ గోస్వామి నియమితులయ్యారు. గోస్వామి నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. కాగా ఏపీ సీజేగా పనిచేస్తున్న జితేంద్ర కుమార్ మహేశ్వరి సిక్కిం హైకోర్టుకు చీఫ్ జస్టిస్‌గా బదిలీపై వెలుతున్నారు. జస్టిస్‌ జేకే మహేశ్వరి గత ఏడాది అక్టోబర్ 7న ఏపీ సీజేగా బాధ్యతలు […]

Update: 2020-12-31 03:42 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అరూప్ కుమార్ గోస్వామి నియమితులయ్యారు. గోస్వామి నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. కాగా ఏపీ సీజేగా పనిచేస్తున్న జితేంద్ర కుమార్ మహేశ్వరి సిక్కిం హైకోర్టుకు చీఫ్ జస్టిస్‌గా బదిలీపై వెలుతున్నారు. జస్టిస్‌ జేకే మహేశ్వరి గత ఏడాది అక్టోబర్ 7న ఏపీ సీజేగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. గువహటి హైకోర్టులో 2011లో అదనపు న్యాయమూర్తిగా, 2012లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2019 అక్టోబర్‌ 15న సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గోస్వామి ఉద్యోగోన్నతి పొందారు.

Tags:    

Similar News