వరంగల్‌లో ఉద్రిక్తత.. TRS నేతలు, రైతుల మధ్య వాగ్వాదం (వీడియో)

దిశ, డైనమిక్ బ్యూరో : టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన విజయగర్జన సభకు భూములను ఇచ్చేందుకు రైతులు వ్యతిరేకిస్తున్నారు. గత కొన్ని రోజులుగా రైతులు పొలాల్లోనే మకాం వేశారు. కానీ, టీఆర్ఎస్ నేతలు రైతులను భూముల కోసం వారిని బయపెడుతూనే ఉన్నారు. అంతేకాకుండా సభ ఎక్కడ నిర్వహించాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, శనివారం టీఆర్ఎస్ నేతలకు, రైతులకు మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేతలు పోలీసులతో […]

Update: 2021-11-06 01:09 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన విజయగర్జన సభకు భూములను ఇచ్చేందుకు రైతులు వ్యతిరేకిస్తున్నారు. గత కొన్ని రోజులుగా రైతులు పొలాల్లోనే మకాం వేశారు. కానీ, టీఆర్ఎస్ నేతలు రైతులను భూముల కోసం వారిని బయపెడుతూనే ఉన్నారు. అంతేకాకుండా సభ ఎక్కడ నిర్వహించాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.

అయితే, శనివారం టీఆర్ఎస్ నేతలకు, రైతులకు మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేతలు పోలీసులతో దేవన్నపేట టోల్ గేట్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కొంత ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో పోలీసు బలగాలు మోహరించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Tags:    

Similar News