పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డివో..

దిశ, కోదాడ: శుక్రవారం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కోదాడ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని గురువారం లక్కినేని కిషోర్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూర్తిస్థాయిలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వెచ్చగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశామన్నారు. ఓటు హక్కు వినియోగించుకుంటున్నది ప్రజా ప్రతినిధులు కావడంతో వారి వెంట కార్యకర్తలను పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకొని రావద్దని సూచించారు. కరోన రూల్స్ ప్రకారం తప్పనిసరిగా […]

Update: 2021-12-09 06:55 GMT

దిశ, కోదాడ: శుక్రవారం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కోదాడ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని గురువారం లక్కినేని కిషోర్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూర్తిస్థాయిలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వెచ్చగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశామన్నారు. ఓటు హక్కు వినియోగించుకుంటున్నది ప్రజా ప్రతినిధులు కావడంతో వారి వెంట కార్యకర్తలను పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకొని రావద్దని సూచించారు.

కరోన రూల్స్ ప్రకారం తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకునే ప్రజాప్రతినిధులు మాస్క్‌ను శానిటైజర్ లు తీసుకురావాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాస్ శర్మ, గ్రామీణ ఎస్సై సాయి ప్రశాంత్, అనంతగిరి ఎస్ఐ సత్యనారాయణ గౌడ్, మున్సిపాలిటీ సిబ్బంది రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News