పవిత్ర స్థలాల్లో గుమిగూడొద్దు: రహమాన్
మతపరమైన పవిత్ర స్థలాల్లో గుమికూడేందుకు ఇది సమయం కాదనీ, ప్రభుత్వ సూచనలను ప్రజలందరూ పాటించాలని ప్రముఖ సంగీత దర్శకులు ఏ.ఆర్.రహమాన్ సోషల్ మీడియా వేదికగా కోరారు. దేవుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటాడనీ, ఇలాంటి పరిస్థితుల్లో మానవత్వం మరింత ప్రస్ఫుటించేలా వ్యవహరిద్దామని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ (కోవిడ్ 19) మహమ్మారిపై పోరాడుతున్న వైద్య సిబ్బందికి రెహమాన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నామనీ, ప్రాణాలను లెక్కచేయకుండా డాక్టర్లు, నర్సులు సేవలు అందిస్తున్న ఈ సంక్షుభిత […]
మతపరమైన పవిత్ర స్థలాల్లో గుమికూడేందుకు ఇది సమయం కాదనీ, ప్రభుత్వ సూచనలను ప్రజలందరూ పాటించాలని ప్రముఖ సంగీత దర్శకులు ఏ.ఆర్.రహమాన్ సోషల్ మీడియా వేదికగా కోరారు. దేవుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటాడనీ, ఇలాంటి పరిస్థితుల్లో మానవత్వం మరింత ప్రస్ఫుటించేలా వ్యవహరిద్దామని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ (కోవిడ్ 19) మహమ్మారిపై పోరాడుతున్న వైద్య సిబ్బందికి రెహమాన్ ధన్యవాదాలు తెలిపారు.
ప్రస్తుతం కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నామనీ, ప్రాణాలను లెక్కచేయకుండా డాక్టర్లు, నర్సులు సేవలు అందిస్తున్న ఈ సంక్షుభిత సమయంలో ఎవరూ భేషజాలకు పోవద్దని హితవు పలికారు. లక్షల మంది ప్రాణాలు మన చేతిలో ఉన్నాయన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని తెలిపారు.
Tags : ar rahman, holy places, gatherings, covid 19 effect