హైకోర్టును ఆశ్రయించిన డైరెక్ట్ మురుగదాస్

           ‘దర్బార్’ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. సినిమా డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ప్రాణభయం ఉందని పోలీసు ప్రొటెక్షన్ కల్పించాలని కోరారు. సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన దర్బార్ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని, రూ.200 కోట్లు వసూళ్లు చేసిందని కథనాలు వచ్చాయి. కానీ, తీరా చూస్తే రూ.25 కోట్లు నష్టపోయామని ఆందోళనకు దిగారు డిస్ట్రిబ్యూటర్లు. ఈ విషయంలోనే బుధవారం రజినీకాంత్‌ను కలిసే ప్రయత్నం […]

Update: 2020-02-06 05:44 GMT

‘దర్బార్’ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. సినిమా డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ప్రాణభయం ఉందని పోలీసు ప్రొటెక్షన్ కల్పించాలని కోరారు. సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన దర్బార్ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని, రూ.200 కోట్లు వసూళ్లు చేసిందని కథనాలు వచ్చాయి. కానీ, తీరా చూస్తే రూ.25 కోట్లు నష్టపోయామని ఆందోళనకు దిగారు డిస్ట్రిబ్యూటర్లు. ఈ విషయంలోనే బుధవారం రజినీకాంత్‌ను కలిసే ప్రయత్నం చేసినా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిరాహార దీక్షకు దిగాలని నిర్ణయించుకున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఈ క్రమంలో డైరెక్టర్ మురుగదాస్ కోర్టును ఆశ్రయించారు.

Tags:    

Similar News