పునీత్ రాజ్‌కుమార్ వాయిస్ కోసం స్పెషల్ టెక్నాలజీ.. ఎందుకో తెలుసా?
దిశ, సినిమా : కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ చిన్నవయసులోనే మరణించడంతో అతని కుటుంబం, ఫ్యాన్స్ ఆ విషాదం నుంచి కోలుకోలేకపోతున్నారు. అయితే పునీత్ నటించిన ‘జేమ్స్’ చిత్రం ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకోగా.. డబ్బింగ్ మాత్రం అలాగే మిగిలిపోయింది. ఇప్పుడు పునీత్ మరణంతో తన క్యారెక్టర్‌కు వేరే ఆర్టిస్టుతో డబ్బింగ్ చెప్పించాలనుకున్నారు. కానీ సెట్ కాదనే ఉద్దేశ్యంతో టెక్నాలజీని ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ‘జేమ్స్’ మూవీ షూటింగ్‌లో పునీత్ రాజ్ కుమార్ పలికిన […]
దిశ, సినిమా : కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ చిన్నవయసులోనే మరణించడంతో అతని కుటుంబం, ఫ్యాన్స్ ఆ విషాదం నుంచి కోలుకోలేకపోతున్నారు. అయితే పునీత్ నటించిన ‘జేమ్స్’ చిత్రం ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకోగా.. డబ్బింగ్ మాత్రం అలాగే మిగిలిపోయింది. ఇప్పుడు పునీత్ మరణంతో తన క్యారెక్టర్‌కు వేరే ఆర్టిస్టుతో డబ్బింగ్ చెప్పించాలనుకున్నారు. కానీ సెట్ కాదనే ఉద్దేశ్యంతో టెక్నాలజీని ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ‘జేమ్స్’ మూవీ షూటింగ్‌లో పునీత్ రాజ్ కుమార్ పలికిన డైలాగ్స్‌కు సరికొత్త టెక్నాలజీ జోడించడం ద్వారా క్వాలిటీ పెంచి విజువల్స్‌కు సింక్ చేయబోతున్నట్లు సమాచారం. దీని కోసం ప్రత్యేకంగా ఓ ముంబై కంపెనీ రంగంలోకి దిగనుందని టాక్. వచ్చే ఏడాది మార్చ్ 17న పునీత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా విడుదల చేయబోతున్నారు. ఇక ‘జేమ్స్’ చిత్రం ఆయన అభిమానులకు చివరి జ్ఞాపకంగా మిగిలిపోనుండగా.. పునీత్‌తో గతంలో ‘రాజకుమార’ తెరకెక్కించిన చేతన్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
#James Dubbing ?
The team will try to use Appu sir voice recorded during the shoot. They need to enhance the Audio quality using the latest technology . Team is planning to work with a Mumbai company for the same.
— Karnataka Box Office | ಕರ್ನಾಟಕ ಬಾಕ್ಸ್ ಆಫೀಸ್ (@Kannada_BO) October 31, 2021