ఏపీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ అడ్వకేట్ ప్యానల్ నియామకం

దిశ, ఏపీ బ్యూరో: భారత న్యాయ మంత్రిత్వ శాఖ ఏపీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్లుగా వాదించడానికి ఐదుగురు ప్యానల్‌తో కూడిన అడ్వకేట్లను నామినేట్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కిలారు కృష్ణభూషణ్ చౌదరి, జె.విఎం.వి.ప్రసాద్, దాట్ల దివ్య, జూపూడి వెంకట కుమార్ యజ్ఞదత్, వెన్నా హేమంత్ కుమార్‌లు ప్యానల్‌లో చోటు దక్కించుకున్నారు. వీరు ఆదాయపు పన్ను, రైల్వే శాఖల మినహా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖల న్యాయపరమైన అంశాలపై ఏపీ హైకోర్టులో […]

Update: 2021-06-19 06:15 GMT

దిశ, ఏపీ బ్యూరో: భారత న్యాయ మంత్రిత్వ శాఖ ఏపీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్లుగా వాదించడానికి ఐదుగురు ప్యానల్‌తో కూడిన అడ్వకేట్లను నామినేట్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కిలారు కృష్ణభూషణ్ చౌదరి, జె.విఎం.వి.ప్రసాద్, దాట్ల దివ్య, జూపూడి వెంకట కుమార్ యజ్ఞదత్, వెన్నా హేమంత్ కుమార్‌లు ప్యానల్‌లో చోటు దక్కించుకున్నారు. వీరు ఆదాయపు పన్ను, రైల్వే శాఖల మినహా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖల న్యాయపరమైన అంశాలపై ఏపీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులుగా వ్యవహరిస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం నియమించిన మొట్టమొదటి అడ్వకేట్ ప్యానల్ ఇది. ఈ ప్యానల్ సభ్యులు 3 ఏళ్ల వరకు ఈ బాధ్యతలు నిర్వహిస్తారు.

Tags:    

Similar News