పీఎంఎంఎస్‌వై రుణాలకోసం ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం

దిశ ప్ర‌తినిధి , హైద‌రాబాద్: మ‌త్స‌్యకారుల ఉత్ప‌త్తుల పెంపు , ఆర్ధిక అభివృద్ధి కోసం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ప్ర‌ధాన మంత్రి మ‌త్స్య సంప‌ది యోజ‌న(పీఎంఎంఎస్‌వై) ద్వారా రాయితీ రుణాలకోసం ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు . ఈ మేర‌కు జిల్లా మ‌త్స్య శాఖ అధికారి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. బీసీ, ఓసీ వ‌ర్గాల‌కు 40 శాతం స‌బ్సీడీతో ఎస్సీ, ఎస్టీలు, మ‌హిళ‌ల‌కు 60 శాతం సబ్సీడి ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. మ‌త్స్య కారులు, మ‌త్స్య స‌హ‌కార […]

Update: 2021-02-06 07:07 GMT

దిశ ప్ర‌తినిధి , హైద‌రాబాద్: మ‌త్స‌్యకారుల ఉత్ప‌త్తుల పెంపు , ఆర్ధిక అభివృద్ధి కోసం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ప్ర‌ధాన మంత్రి మ‌త్స్య సంప‌ది యోజ‌న(పీఎంఎంఎస్‌వై) ద్వారా రాయితీ రుణాలకోసం ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు . ఈ మేర‌కు జిల్లా మ‌త్స్య శాఖ అధికారి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. బీసీ, ఓసీ వ‌ర్గాల‌కు 40 శాతం స‌బ్సీడీతో ఎస్సీ, ఎస్టీలు, మ‌హిళ‌ల‌కు 60 శాతం సబ్సీడి ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. మ‌త్స్య కారులు, మ‌త్స్య స‌హ‌కార సంఘాలు , ఔత్సాహిక పారిశ్రామిక వేత్త‌లు , ప్రైవేట్ వ్య‌క్తులు, ఎస్సీ , ఎస్టీ వ‌ర్గాల‌తో పాటు మ‌హిళ‌లు ఈ అవ‌కాశాన్నిస‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు .

రిస‌ర్క్యులేట‌రీ ఆక్వా క‌ల్చ‌ర్ సిస్టం కింద 6 యూనిట్లు , చేప‌ల స‌ర‌ఫ‌రా కోసం వాహ‌నాలు 10 , ఆటోలు 125 , ఫిష్ రిటేల్ ఔట్ లెట్స్ 40 ఇవ్వ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ఆయా ప‌థ‌కాల‌ను సంబంధించి అర్హులైన వారిని జిల్లా స్థాయిలో ఎంపిక చేసి వారి పేర్ల‌ను రాష్ట్ర స్థాయిలో పంపి వారికి యూనిట్ల‌ను మంజూరు చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు. ఇత‌ర వివ‌రాల‌ను జిల్లా మ‌త్స్య శాఖ అధికారి కార్యాల‌యం నుండి పొందాల‌ని జిల్లా మ‌త్స్య శాఖ అధికారి విజ్ఞ‌ప్తి చేశారు .

Tags:    

Similar News