అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా యాపిల్
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజ కంపెనీ యాపిల్ కొవిడ్-19 కాలంలోనూ అదిరిపోయే ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్ లిస్టెడ్ కంపెనీగా యాపిల్ కంపెనీ స్థానం దక్కించుకుంది. రెండో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ప్రకటించిన తర్వాత కంపెనీ షేర్ ఏకంగా 10 శాతానికి మించి లాభపడింది. దీంతో యాపిల్ షేర్ ధర 425.04 డాలర్ల వద్ద ర్యాలీ చేసింది. అలాగే, యాపిల్ కంపెనీ మార్కెట్ క్యాప్ సౌదీ ఆరామ్‌కో మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజ కంపెనీ యాపిల్ కొవిడ్-19 కాలంలోనూ అదిరిపోయే ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్ లిస్టెడ్ కంపెనీగా యాపిల్ కంపెనీ స్థానం దక్కించుకుంది. రెండో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ప్రకటించిన తర్వాత కంపెనీ షేర్ ఏకంగా 10 శాతానికి మించి లాభపడింది.
దీంతో యాపిల్ షేర్ ధర 425.04 డాలర్ల వద్ద ర్యాలీ చేసింది. అలాగే, యాపిల్ కంపెనీ మార్కెట్ క్యాప్ సౌదీ ఆరామ్‌కో మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను దాటి 1.82 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇక, సౌదీ ఆరామ్‌కో కంపెనీ గతేడాది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత గత వారాంతంలో 1.76 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.
కొవిడ్-19 వ్యాప్తి తర్వాత యూఎస్‌లో టెక్నాలజీ షేర్లకు భారీగా డిమాండ్ పెరిగింది. యాపిల్ షేర్ ఈ ఏడాదిలో 45 శాతం ర్యాలీ చేసింది. ఇక, ప్రస్తుతం జూన్ త్రైమాసికంలో యాపిల్ కంపెనీ 16 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను పెట్టుబడిదారుల నుంచి బైబ్యాక్‌గా కొనుగోలు చేసింది. ఇక, గత వారాంతంతో కంపెనీ వద్ద 4.33 బిలియన్ల ఔట్‌స్టాండింగ్ షేర్ ఉన్నాయని నాస్‌డాక్ ఎక్స్ఛేంజ్ గణాంకాల ద్వారా తెలుస్తోంది.