ఇకపై ఐఫోన్‌తో కార్ అన్‌లాక్!
దిశ, వెబ్‌డెస్క్ : చాలా మంది చిన్న చిన్న విషయాలను తరచుగా మరిచిపోతుంటారు. ఆ జాబితాలో మొట్టమొదట ఉండేది ‘కార్ కీ’. అయితే ఇకపై అలా మరిచిపోయినా.. ఏ ప్రాబ్లెమ్ ఉండదు. ఎందుకంటే, కార్లను ఐఫోన్‌తో అన్‌లాక్ చేయడానికి వీలుగా యాపిల్.. ‘కార్ కీ’ని తీసుకొచ్చింది. ఇటీవలే విడుదల చేసిన ఐవోఎస్ 14లో ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఐవోఎస్ 13లోనూ ఈ ఫీచర్ పనిచేస్తుందని యాపిల్ సంస్థ వెల్లడించింది. తొలిగా బీఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ కారుతో ఈ […]
దిశ, వెబ్‌డెస్క్ : చాలా మంది చిన్న చిన్న విషయాలను తరచుగా మరిచిపోతుంటారు. ఆ జాబితాలో మొట్టమొదట ఉండేది ‘కార్ కీ’. అయితే ఇకపై అలా మరిచిపోయినా.. ఏ ప్రాబ్లెమ్ ఉండదు. ఎందుకంటే, కార్లను ఐఫోన్‌తో అన్‌లాక్ చేయడానికి వీలుగా యాపిల్.. ‘కార్ కీ’ని తీసుకొచ్చింది. ఇటీవలే విడుదల చేసిన ఐవోఎస్ 14లో ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఐవోఎస్ 13లోనూ ఈ ఫీచర్ పనిచేస్తుందని యాపిల్ సంస్థ వెల్లడించింది. తొలిగా బీఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ కారుతో ఈ ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేయనున్నారు. అల్ట్రా వైడ్‌బ్యాండ్ చిప్ టెక్నాలజీని ఇందుకోసం వినియోగించారు.
ఎన్ఎఫ్‌సీ (నియర్ ఫీల్డ్ టెక్నాలజీ) రీడర్ సాయంతో ఐఫోన్ లేదా యాపిల్ వాచ్ కార్ కీని పెయిర్ చేసుకోవాలి. ఆ తర్వాత యాపిల్ డివైజ్‌ను ఎన్‌ఎఫ్‌సీ రీడర్ దగ్గర ఉంచితే చాలు, కారు డోర్ ఓపెన్ అవుతుంది. కార్ కీ అయితే మర్చిపోతాం కానీ, మొబైల్ ఫోన్ లేదా వాచ్ ఎప్పుడూ మనతోనే ఉంటాయి. ఇతర యాప్స్‌లో ఇలాంటి ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది. కానీ యాపిల్ ఐఓఎస్ దీన్ని తమ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చింది.