యూఏఈ ప్రయాణీకులకు అపోలో పరీక్షలు

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు యూఏఈలోని అతిపెద్ద ల్యాబొరేటరీ నెట్‌వర్క్ ఫ్యూర్‌ హెల్త్.. అపోలో డయాగ్నస్టిక్‌తో కలిసి పనిచేస్తుంది. యూఏఈ వచ్చేవారికి స్క్రీనింగ్ చేసి తద్వారా ప్రయాణాన్ని సురక్షితం చేయడానికి అక్కడి ప్రభుత్వం ఫ్యూర్‌హెల్త్‌ను నియమించింది. ఈ సందర్భంగా అపోలో సీఈవో చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్యూర్ హెల్త్ సంస్థ కరోనాను నివారించడానికి చేస్తున్న కృషి తమకు సంతోషం కలిగించిందన్నారు. స్ర్కీనింగ్‌ నిర్వహించేందుకు అపోలో డయాగ్నస్టిక్స్ దేశంలో 9కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేసిందన్నారు. హైదరాబాదులో నల్లగండ్ల, వెస్ట్‌మారేడ్‌పల్లి […]

Update: 2020-09-05 07:50 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు యూఏఈలోని అతిపెద్ద ల్యాబొరేటరీ నెట్‌వర్క్ ఫ్యూర్‌ హెల్త్.. అపోలో డయాగ్నస్టిక్‌తో కలిసి పనిచేస్తుంది. యూఏఈ వచ్చేవారికి స్క్రీనింగ్ చేసి తద్వారా ప్రయాణాన్ని సురక్షితం చేయడానికి అక్కడి ప్రభుత్వం ఫ్యూర్‌హెల్త్‌ను నియమించింది. ఈ సందర్భంగా అపోలో సీఈవో చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్యూర్ హెల్త్ సంస్థ కరోనాను నివారించడానికి చేస్తున్న కృషి తమకు సంతోషం కలిగించిందన్నారు. స్ర్కీనింగ్‌ నిర్వహించేందుకు అపోలో డయాగ్నస్టిక్స్ దేశంలో 9కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేసిందన్నారు. హైదరాబాదులో నల్లగండ్ల, వెస్ట్‌మారేడ్‌పల్లి కేంద్రాలు, విజయవాడలో వెంకటేశ్వరపురం, కోల్‌కతాలోని లేక్‌టౌన్, ముదైలీ, పుణెలో వాకాడ్, బవ్దాన్, ధనోరి కేంద్రాలు, ఢిల్లీలో(ఇంటి వద్దనే సేకరణ) ఉన్నాయన్నారు.

ఈ సేవలను వినియోగించుకోవడానికి యూఏఈ వెళ్లే ప్రయాణీకులు ముందుగా screening.purehealth.ae అనే వెబ్‌సైట్‌కి వెళ్లి తమ నివాసప్రాంతంతో పాటు సమయాన్ని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తమ చెల్లింపులను ఆన్‌లైన్‌లో పూర్తిచేసి స్థానిక ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా వైద్యుని సిఫార్సు, ఆధార్ కార్డు, పాస్ పోర్టు, నగదు చెల్లింపులకు సంబంధించిన రసీదు తీసుకొని కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఈ పరీక్షా ఫలితాలను నేరుగా ప్రభుత్వ అధికారులకు పంపిస్తారు. అందిన ఫలితాలను తమ దేశంలోనికి వచ్చే ప్రయాణికులకు సంబంధించిన సమాచారాన్ని వారి వద్ద ఉన్న బోర్డర్ కంట్రోల్ డేటాబేస్ ద్వారా సరిపోల్చుకొని చూస్తారు.

Tags:    

Similar News