కమల్ సార్.. మీ సినిమాలు చూస్తే డిగ్రీ, పీహెచ్‌డీ చేసినట్టే

దిశ, సినిమా : డైరెక్టర్ ఆల్ఫోన్స్ పుత్రేన్.. లోకనాయకుడు కమల్‌హాసన్‌కు చేసిన రిక్వెస్ట్ వైరల్ అయింది. ఈ ఫేస్‌బుక్ పోస్ట్‌పై కమల్ కూడా స్పందించగా.. వీరిద్దరి మధ్య కన్వర్జేషన్‌ నెటిజన్లను ఇంప్రెస్ చేసింది. 1990 క్లాసిక్ ‘మైఖేల్ మదన కామరాజన్’ సినిమాలో అసలు ఎలా నటించారో సీక్రెట్ చెప్పమని ఈ యంగ్ డైరెక్టర్ కోరాడు. ఈ చిత్రాన్ని చూడటం డిగ్రీ కోర్స్ చేయడం లాంటిదన్న ఆయన.. ‘దశావతారం’ సినిమా ఫిల్మ్‌మేకింగ్‌లో పీహెచ్‌డీ లాంటిదని చెప్పాడు. దీనిపై స్పందించిన […]

Update: 2021-06-18 06:30 GMT
కమల్ సార్.. మీ సినిమాలు చూస్తే డిగ్రీ, పీహెచ్‌డీ చేసినట్టే
  • whatsapp icon

దిశ, సినిమా : డైరెక్టర్ ఆల్ఫోన్స్ పుత్రేన్.. లోకనాయకుడు కమల్‌హాసన్‌కు చేసిన రిక్వెస్ట్ వైరల్ అయింది. ఈ ఫేస్‌బుక్ పోస్ట్‌పై కమల్ కూడా స్పందించగా.. వీరిద్దరి మధ్య కన్వర్జేషన్‌ నెటిజన్లను ఇంప్రెస్ చేసింది. 1990 క్లాసిక్ ‘మైఖేల్ మదన కామరాజన్’ సినిమాలో అసలు ఎలా నటించారో సీక్రెట్ చెప్పమని ఈ యంగ్ డైరెక్టర్ కోరాడు. ఈ చిత్రాన్ని చూడటం డిగ్రీ కోర్స్ చేయడం లాంటిదన్న ఆయన.. ‘దశావతారం’ సినిమా ఫిల్మ్‌మేకింగ్‌లో పీహెచ్‌డీ లాంటిదని చెప్పాడు.

దీనిపై స్పందించిన కమల్ ‘ థాంక్యూ ఆల్ఫోన్స్ పుత్రేన్. త్వరలో దీనిపై ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు ఎంత నేర్పుతుందో తెలియదు కానీ మీరు చెప్పినట్లుగా ఈ సినిమా మాస్టర్ క్లాస్. ఇన్నేళ్ల తర్వాత దీని గురించి మాట్లాడటం కొత్త పాఠాలు నేర్పుతున్నట్లుగా ఉంది’ అని తెలిపాడు. కాగా కమల్ నాలుగు పాత్రల్లో కనిపించిన కామెడీ డ్రామా ‘మైఖేల్ మదన కామరాజన్’ బిగ్గెస్ట్ సక్సెస్ అందుకుంది. సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రూపిని, ఊర్వశి, ఖుష్బూ, ఢిల్లీ గణేష్, నగేష్ ప్రధానపాత్రల్లో కనిపించారు.

Tags:    

Similar News