కృష్ణాబోర్డుకు ఏపీ లేఖ

దిశ, న్యూస్‌బ్యూరో: ఏపీలో కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు ఇంకా పూర్తి కాలేదని, అవి పూర్తిచేసిన వెంటనే బోర్డుకు ఇస్తామని ఏపీ జలవనరుల శాఖ స్పష్టం చేసింది. పదేపదే డీపీఆర్‌లపై రాద్ధాంతం చేయరాదన్నట్టుగా పేర్కొంది. రాష్ట్ర విభజనకు ముందే పలు ప్రాజెక్టులకు అనుమతులున్నాయని వెల్లడించింది. కృష్ణా బోర్డుకు ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ లేఖ రాశారు. ఈలేఖలో కొత్త ప్రాజెక్టుల అంశాలను వివరించారు. అదేవిధంగా పలు ప్రాజెక్టులు పాతవేనని పేర్కొన్నారు. గురు రాఘవేంద్ర, సిద్దాపురం, శివభాష్యం ఎత్తిపోతలు, […]

Update: 2020-07-11 10:01 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: ఏపీలో కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు ఇంకా పూర్తి కాలేదని, అవి పూర్తిచేసిన వెంటనే బోర్డుకు ఇస్తామని ఏపీ జలవనరుల శాఖ స్పష్టం చేసింది. పదేపదే డీపీఆర్‌లపై రాద్ధాంతం చేయరాదన్నట్టుగా పేర్కొంది. రాష్ట్ర విభజనకు ముందే పలు ప్రాజెక్టులకు అనుమతులున్నాయని వెల్లడించింది. కృష్ణా బోర్డుకు ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ లేఖ రాశారు. ఈలేఖలో కొత్త ప్రాజెక్టుల అంశాలను వివరించారు. అదేవిధంగా పలు ప్రాజెక్టులు పాతవేనని పేర్కొన్నారు. గురు రాఘవేంద్ర, సిద్దాపురం, శివభాష్యం ఎత్తిపోతలు, మున్నేరు పథకాలు పాతవేనని, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం రాష్ట్ర విభజనకు ముందే పూర్తి చేసినట్లు చెప్పారు. వీటికి సంబంధించిన అనుమతులన్నీ ఉమ్మడి రాష్ట్రంలోనే తీసుకున్నట్లు పేర్కొన్నారు. వీటికి డీపీఆర్‌లు బోర్డుకు, కేంద్ర జలసంఘానికి, అపెక్స్ ముందు పెట్టాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఇక గుండ్రేవుల, ఆర్డీఎస్ కుడి కాల్వ, వేదవతి (హంగ్రీ) ఎత్తిపోతలు కొత్తగా నిర్మాణం చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఒప్పుకుంది. అయితే వీటికి సంబంధించిన డీపీఆర్‌లు ఇంకా సిద్ధం కాలేదని, అవి సిద్ధం అయిన తర్వాత బోర్డుకు అందిస్తామని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే బోర్డు, సీడబ్ల్యూసీ పలుమార్లు డీపీఆర్‌ల అంశంపై లేఖలు రాయడంతో ఏపీ పైవిధంగా స్పందించింది.

Tags:    

Similar News