ఆ టీడీపీ ఎమ్మెల్యేలు తెలంగాణ కోవర్టులు
దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై బీజేపీ సీనియర్ నేత విష్ణువర్థన్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రభుత్వానికి కోవర్టులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల వల్ల ప్రకాశం జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆరోపిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, బాల వీరాంజనేయ స్వామి, సాంబశివరావు సీఎం జగన్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై విష్ణువర్థన్‌రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి రాసిన లేఖ […]
దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై బీజేపీ సీనియర్ నేత విష్ణువర్థన్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రభుత్వానికి కోవర్టులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల వల్ల ప్రకాశం జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆరోపిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, బాల వీరాంజనేయ స్వామి, సాంబశివరావు సీఎం జగన్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై విష్ణువర్థన్‌రెడ్డి మండిపడ్డారు.
ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి రాసిన లేఖ తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని ఆరోపించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే లేఖ రాసిన ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలాను యథేచ్ఛగా వాడటం వల్ల రాయలసీమ ఎడారిగా మారుతుందన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేను కూడా పులిచింతల ప్రాజెక్టు వద్దకు వెళ్లకుండా తెలంగాణ పోలీసులు అడ్డుకున్నా సీఎం జగన్ నోరు మెదపకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
జగన్ లేఖలు ప్రేమ లేఖలు
కృష్ణా జలాల వివాదంపై సీఎం జగన్ కేంద్రానికి రాస్తున్న లేఖలపై విష్ణువర్థన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ రాస్తున్న లేఖలు ప్రేమలేఖలు మాదిరిగా ఉన్నాయంటూ సెటైర్లు వేశారు. కేంద్రానికి లేఖలు రాసి వివాదం నుంచి తప్పుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నారని ఆరోపించారు. శ్రీశైలం డ్యాంలో నీరు అడుగంటినా తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలుగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని, దీనిపై జగన్ నోరెందుకు మెదపడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలు తెలంగాణ ప్రభుత్వానికి వైసీపీ నాయకులు తాకట్టు పెట్టారని విష్ణువర్థన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
మరోవైపు రాష్ట్ర అభివృద్ధిపై సీఎం జగన్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందని తెలిపారు. ప్రభుత్వం జీతాలు ఇవ్వలేని పరిస్థితులో ఉందన్నారు. కులాల కార్పొరేషన్ ద్వారా ఒక్క కులానికి న్యాయం చేయలేదని ధ్వజమెత్తారు. షెడ్యూల్డ్ కులాల నిధులను ప్రభుత్వం వాడుకుంటుందని విష్ణువర్థన్‌రెడ్డి ఆరోపించారు.