AP Deputy CM: ఎర్ర చందనం స్మగ్లింగ్ కట్టడిపై పవన్ కళ్యాణ్ ఫోకస్!

ఎర్రచందనం అమ్మకాలు(Red sandalwood sales), ఎగుమతుల ప్రక్రియను సింగల్ విండో విధానానికి మార్చాలని, దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ‘ఈ – వేలం’

Update: 2024-11-27 09:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎర్రచందనం అమ్మకాలు(Red sandalwood sales), ఎగుమతుల ప్రక్రియను సింగల్ విండో విధానానికి మార్చాలని, దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ‘ఈ – వేలం’లో మెరుగైన ఫలితాలు వస్తాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan) కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ గారికి తెలియ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ నేడు(బుధవారం) ఉదయం భూపేంద్ర యాదవ్(Bhupendra Yadav) గారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎర్రచందనం రక్షణ, స్మగ్లింగ్ నిరోధం, దుంగల అమ్మకం విషయంలో అనుసరిస్తున్న విధానాల మీద కేంద్ర మంత్రితో చర్చించారు.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కేంద్ర మంత్రి దృష్టికి ఈ విషయాలు తీసుకువచ్చారు. ‘‘బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల ప్రతిపాదించిన ప్రకారం ఎర్ర చందనం అమ్మకం, ఎగుమతి చేసే విషయంలో సింగిల్ విండో విధానం ఉంటే మేలు జరుగుతుంది. ఈ విధానానికి ఏపీ అటవీశాఖ(Forest Department) కస్టోడియన్‌గా వ్యవహరిస్తుంది. ఈ ప్రతిపాదనను పరిశీలించగలరు. ఏపీ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎర్రచందనం గ్రేడింగ్, వేలం, ఎగుమతి సాగిస్తుంది. తద్వారా ఈ-వేలం ద్వారా రెవెన్యూ పెరుగుతుంది’’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ఏ రాష్ట్రంలో పట్టుబడినా..

‘ఎర్రచందనం అరుదైన వృక్ష సంపద. ఆంధ్ర ప్రదేశ్ అటవీ ప్రాంతంలోనే పెరుగుతుంది. ఈ క్రమంలో కేంద్రం నిబంధనలు సవరించి ఆంధ్రప్రదేశ్ వెలుపల పట్టుబడ్డ ఎర్రచందనం సైతం సింగిల్ విండో వేలంలో భాగం కస్టోడియన్ గా ఉండే ఏపీ రాష్ట్రానికే దక్కేలా చూడాలి. దీనివల్ల ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పట్టుబడిన ఎర్రచందనం అమ్ముకోవడానికి కుదరదు. అమ్మకాలు, ఎగుమతులు ఒకే విధానం ద్వారా కొనసాగుతుంది. కేంద్ర పర్యవేక్షణతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కస్టోడియన్ గా కొనసాగుతుంది’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వివరించారు.

Tags:    

Similar News