ఏపీలో హాట్‌టాపిక్‌గా మారిన బాక్సైట్ తవ్వకాలు
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై ఏపీ సర్కార్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అన్‌రాక్‌తో ఉన్న వివాదానికి పరిష్కారం కనుగొనే పనిలో ఏపీ ప్రభుత్వం పడింది. బాక్సైట్ తవ్వకాలు జరపకుండా వివాదాన్ని పరిష్కరించేందుకు కసరత్తు చేస్తున్నారు అధికారులు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాక్సైట్ తవ్వకాలు జరిపేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, అన్‌రాక్ వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయాలపై వైసీపీ ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. అన్‌రాక్‌కు వేరే రాష్ట్రంలోని బాక్సైట్ గనులను అప్పగింతపై కేంద్రాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది. […]
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై ఏపీ సర్కార్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అన్‌రాక్‌తో ఉన్న వివాదానికి పరిష్కారం కనుగొనే పనిలో ఏపీ ప్రభుత్వం పడింది. బాక్సైట్ తవ్వకాలు జరపకుండా వివాదాన్ని పరిష్కరించేందుకు కసరత్తు చేస్తున్నారు అధికారులు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాక్సైట్ తవ్వకాలు జరిపేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కాగా, అన్‌రాక్ వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయాలపై వైసీపీ ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. అన్‌రాక్‌కు వేరే రాష్ట్రంలోని బాక్సైట్ గనులను అప్పగింతపై కేంద్రాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర గనుల మంత్రిత్వ శాఖతో ఏపీ అధికారులు సంప్రదింపులు జరిపారు. అన్‌రాక్‌లో రకియా వాటాలను ప్రభుత్వమే కొనుగోలు చేసే అంశంపై చర్చించినట్లు సమాచారం.