వాలంటీర్ వ్యవస్థ స్వర్ణాక్షరాలతో లిఖించబడుతుంది: తమ్మినేని సీతారాం

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవ్యస్థపై దేశంమొత్తం హర్షం వ్యక్తం చేస్తుందని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ దేశ పాలనా వ్యవస్థలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నారు. వాలంటీర్ లకు సేవ పురస్కారం కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా రాజాం లో నిర్వహించగా హాజరైన సీతారాం ఈ వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా రానున్న రోజుల్లో జగన్ లాంటి సీఎం మరొకరు రాలేరన్నారు. లాక్ డౌన్ […]

Update: 2021-04-12 06:53 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవ్యస్థపై దేశంమొత్తం హర్షం వ్యక్తం చేస్తుందని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ దేశ పాలనా వ్యవస్థలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నారు. వాలంటీర్ లకు సేవ పురస్కారం కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా రాజాం లో నిర్వహించగా హాజరైన సీతారాం ఈ వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా రానున్న రోజుల్లో జగన్ లాంటి సీఎం మరొకరు రాలేరన్నారు. లాక్ డౌన్ సమయంలో వాలంటీర్ లు చేసిన సేవలను కొనియాడారు. కొందరు రాజకీయ లబ్ది కోసం వాలంటీర్ వ్యవస్థపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, వారి మాటలను పట్టించుకుకోకుండా వాలంటీర్ లు మరింత ఉత్సాహంగా పనిచేయాలని కోరారు.

Tags:    

Similar News