'ఫీ' జులుం చేస్తే చూస్తూ ఊరుకోం: ఏపీ

కరోనా వ్యాప్తి నిరోధానికి చర్యలు చేపడుతూనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనావ్యవహారాలు చక్కబెడుతోంది. ఒకవైపు లాక్‌డౌన్ నేపథ్యంలో కఠిన చర్యలు చేపడుతూ, వచ్చే విద్యా సంవత్సరం ఆరంభంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఫీజులుంపై పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ మార్గదర్శకాలు జారీ చేసింది. లాక్‌డౌన్ అనంతరం ప్రవేశాల నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో తొలి విడత ఫీజు మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది. అది కూడా, తొలి విడత ఫీజును […]

Update: 2020-04-24 05:28 GMT

కరోనా వ్యాప్తి నిరోధానికి చర్యలు చేపడుతూనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనావ్యవహారాలు చక్కబెడుతోంది. ఒకవైపు లాక్‌డౌన్ నేపథ్యంలో కఠిన చర్యలు చేపడుతూ, వచ్చే విద్యా సంవత్సరం ఆరంభంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఫీజులుంపై పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ మార్గదర్శకాలు జారీ చేసింది.

లాక్‌డౌన్ అనంతరం ప్రవేశాల నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో తొలి విడత ఫీజు మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది. అది కూడా, తొలి విడత ఫీజును రెండు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు విద్యార్థుల తల్లిదండ్రులకు కల్పించాలని సూచించింది. ఫీజు చెల్లించలేదన్న కారణంతో, లేదా అధిక ఫీజులు వసూలు చేస్తూ ఏ ఒక్క విద్యార్థి ప్రవేశాన్ని నియంత్రించినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

Tags:ap school education control and monitoring commission, ap, school education, private schools and colleges

Tags:    

Similar News