లండన్ నుంచి గన్నవరం చేరుకున్న ఏపీ వాసులు

దిశ, ఏపీ బ్యూరో: వందేభారత్ మిషన్-2లో భాగంగా 156 మంది ప్రవాసీయులతో కూడిన విమానం విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంది. లండన్ నుంచి ముంబై చేరుకున్న వీరిని అక్కడి నుంచి నేరుగా గన్నవరం ఎయిర్ పోర్టుకి పంపడం విశేషం. ఎయిర్‌పోర్టులోనే అధికారులు వీరికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. క్వారంటైన్ కేంద్రాలకు తరలించేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఈ బస్సుల్లో వారి వారి జిల్లాలకు తరలించనున్నారు. ఆ జిల్లా కేంద్రాల్లో వారిని స్తోమతను బట్టి పెయిడ్, […]

Update: 2020-05-20 00:41 GMT

దిశ, ఏపీ బ్యూరో: వందేభారత్ మిషన్-2లో భాగంగా 156 మంది ప్రవాసీయులతో కూడిన విమానం విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంది. లండన్ నుంచి ముంబై చేరుకున్న వీరిని అక్కడి నుంచి నేరుగా గన్నవరం ఎయిర్ పోర్టుకి పంపడం విశేషం. ఎయిర్‌పోర్టులోనే అధికారులు వీరికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. క్వారంటైన్ కేంద్రాలకు తరలించేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.

ఈ బస్సుల్లో వారి వారి జిల్లాలకు తరలించనున్నారు. ఆ జిల్లా కేంద్రాల్లో వారిని స్తోమతను బట్టి పెయిడ్, ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచుతారు. 14 రోజుల క్వారంటైన్ అనంతరం వారిని ఇళ్లకు పంపనున్నారు. ఈ క్రమంలో విదేశీ ప్రయాణీకులు పూర్తి వివరాలను ఎయిర్ పోర్టులోనే అధికారులు నమోదు చేస్తున్నారు.

Tags:    

Similar News