దక్షిణ కొరియా నుంచి లక్ష కిట్లు తెప్పించిన ఏపీ
కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శక్తిమేర కృషి చేస్తోంది. ఎన్ని సంరక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా విస్తరిస్తూనే ఉంది. పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూ ప్రభుత్వంతో పాటు వైద్యులకు సవాలు విసురుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తికి ముకుతాడు వేయాలని నిర్ణయించుకున్న ఏపీ గవర్నమెంట్ దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లను దిగుమతి చేసుకుంది. సియోల్ నుంచి ప్రత్యేక చార్టర్డ్ విమానంలో లక్ష కరోనా టెస్టింగ్ కిట్లను తెప్పించారు. వీటిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయలో […]
కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శక్తిమేర కృషి చేస్తోంది. ఎన్ని సంరక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా విస్తరిస్తూనే ఉంది. పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూ ప్రభుత్వంతో పాటు వైద్యులకు సవాలు విసురుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తికి ముకుతాడు వేయాలని నిర్ణయించుకున్న ఏపీ గవర్నమెంట్ దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లను దిగుమతి చేసుకుంది.
సియోల్ నుంచి ప్రత్యేక చార్టర్డ్ విమానంలో లక్ష కరోనా టెస్టింగ్ కిట్లను తెప్పించారు. వీటిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. కేవలం పది నిమిషాల్లోనే ఈ టెస్టింగ్ కిట్లుతో ఫలితాన్ని సాధించొచ్చని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ కిట్ల సాయంతో ఏకకాలంలో వేలమందికి కరోనా టెస్టులు చేయవచ్చని అధికారులు అంటున్నారు.
దీంతో రానున్న నాలుగైదు రోజుల్లో అన్ని జిల్లాలకు ఈ కొరియా టెస్టింగ్ కిట్లను పంపిస్తామని, భారీ సంఖ్యలో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. దక్షిణ కొరియాలో ఈ కిట్లతో పరీక్షలు నిర్వహించడం ద్వారానే కరోనాకు అడ్డుకట్ట వేశారని చెబుతున్నారు. కరోనా ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న తరుణంలో కూడా అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయంటే ఈ కిట్ల పనితీరును అర్ధం చేసుకోవచ్చని వారు సూచిస్తున్నారు.
tags:andhra pradesh, coronavirus testing kits, south korea, 10 minute corona test, ap cm, jagan