ఏపీ రాజ్‌భవన్‌ సిబ్బందికి కరోనా పాజిటివ్

దిశ, న్యూస్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది. ఒక్క రోజు వ్యవధిలోనే 81 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం సంఖ్య 1097కు చేరుకుంది. గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్‌భవన్‌లో సైతం నర్సుకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. అయితే మరో ముగ్గురికి కూడా పాజిటివ్ వచ్చినట్లు అనధికార వర్గాల సమాచారం. సెక్యూరిటీ విభాగంలోని ఒక అధికారికి, వైద్య సిబ్బందిలో ఒకరికి, నాల్గవ తరగతి […]

Update: 2020-04-26 12:00 GMT

దిశ, న్యూస్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది. ఒక్క రోజు వ్యవధిలోనే 81 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం సంఖ్య 1097కు చేరుకుంది. గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్‌భవన్‌లో సైతం నర్సుకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. అయితే మరో ముగ్గురికి కూడా పాజిటివ్ వచ్చినట్లు అనధికార వర్గాల సమాచారం. సెక్యూరిటీ విభాగంలోని ఒక అధికారికి, వైద్య సిబ్బందిలో ఒకరికి, నాల్గవ తరగతి ఉద్యోగుల్లో ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ప్రభుత్వం అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ధృవీకరించాల్సి ఉంది. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ స్వయంగా వార్తా ఏజెన్సీతో మాట్లాడుతూ.. ఆయన కుటుంబంలోని ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు.

Tags : Corona, Possitive, Rajbhavan, AP, PTI

Tags:    

Similar News