ఏపీ పీజీఈ సెట్ ఫలితాలు విడుదల
దిశ, వెబ్డెస్క్: ఏపీ పీజీ ఈసెట్ 2020 ఫలితాలను శుక్రవారం ఏయూ ఉప కులపతి ఆచార్య పీవీ జీడీ ప్రసాద్ రెడ్డి విడుదల చేశారు. ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాలకు 28,868 మంది అప్లయి చేసుకోగా.. 22,911 మంది పరీక్షకు హజరయ్యారని ప్రసాద్ రెడ్డి తెలిపారు. అందులో 20,157 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఈ ప్రవేశాల పరీక్షల్లో 87.98 శాతం మంది అర్హులయ్యారని వెల్లడించారు. ఎంటెక్‌కు 17,150 మంది హాజరు కాగా, 14,775 మంది అర్హత సాధించారన్నారు. ఫార్మసీ […]
దిశ, వెబ్డెస్క్: ఏపీ పీజీ ఈసెట్ 2020 ఫలితాలను శుక్రవారం ఏయూ ఉప కులపతి ఆచార్య పీవీ జీడీ ప్రసాద్ రెడ్డి విడుదల చేశారు. ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాలకు 28,868 మంది అప్లయి చేసుకోగా.. 22,911 మంది పరీక్షకు హజరయ్యారని ప్రసాద్ రెడ్డి తెలిపారు. అందులో 20,157 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఈ ప్రవేశాల పరీక్షల్లో 87.98 శాతం మంది అర్హులయ్యారని వెల్లడించారు.
ఎంటెక్‌కు 17,150 మంది హాజరు కాగా, 14,775 మంది అర్హత సాధించారన్నారు. ఫార్మసీ పరీక్షలకు 5,761 మంది హాజరు కాగా 5,382 మంది అర్హత సాధించారని వెల్లడించారు. ఎంఫార్మసీ అడ్మిషన్స్ ఆన్లైన్లో నిర్వహిస్తామని తెలిపారు. కరోనా కారణంగా ఈ పరీక్షలకు హజరు కాలేని అభ్యర్థులకు మరోసారి పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.