తిరుమలలో ఏపీ మంత్రుల హల్‌చల్.. భక్తులు ఆగ్రహం

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో శుక్రవారం ఉదయం ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ శ్రీవారిని దర్శించుకోవడం వివాదాస్పదంగా మారింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా నైట్‌కర్ఫ్యూ పొడగించడంతో పాటు, తిరుమలలో భక్తులకు టీటీడీ సర్వ దర్శనాన్ని రద్దుచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రులు నిబంధనలు ఉల్లంఘించి అనుచరులతో ప్రోటోకాల్ ప్రకారం దర్శనం చేసుకోడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మంత్రి జయరాం, అంతకుముందు మంత్రి వేణుగోపాలకృష్ణ, ఇవాళ(శుక్రవారం) మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ […]

Update: 2021-08-19 22:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో శుక్రవారం ఉదయం ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ శ్రీవారిని దర్శించుకోవడం వివాదాస్పదంగా మారింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా నైట్‌కర్ఫ్యూ పొడగించడంతో పాటు, తిరుమలలో భక్తులకు టీటీడీ సర్వ దర్శనాన్ని రద్దుచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రులు నిబంధనలు ఉల్లంఘించి అనుచరులతో ప్రోటోకాల్ ప్రకారం దర్శనం చేసుకోడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మంత్రి జయరాం, అంతకుముందు మంత్రి వేణుగోపాలకృష్ణ, ఇవాళ(శుక్రవారం) మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దాదాపు 67 మంది అనుచరులతో శ్రీవారిని దర్శించుకున్నారు. దీంతో శ్రీవారి ఆలయం మంత్రుల అడ్డాగా మారిపోయిందని, భక్తులకు దర్శనం కల్పించకుండా వారి అనుచరులకు ప్రోటోకాల్‌తో దర్శనం చేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, దీనిపై స్పందించిన మంత్రి వెల్లంపల్లి అనుచరులతో దర్శనం చేసుకుంటే తప్పేముంది అని సమర్థించుకున్నారు. కరోనా నిబంధనల మేరకు సర్వదర్శనం ఇప్పట్లో అనుమతించబోమని వెల్లంపల్లి స్పష్టం చేశారు.

Follow Disha daily- Andhra Pradesh Facebook official page https://www.facebook.com/TeluguAndhranews

Tags:    

Similar News