చంద్రబాబు ఎక్కడున్నా స్పందించాలి
దిశ ఏపీ బ్యూరో: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ‘పోతిరెడ్డిపాడు’ వార్ జరుగుతోంది. ఈ విషయంపై తెలంగాణ రాజకీయ పక్షాలు ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నాయి. తమకు కేటాయించిన జలాల సంపూర్ణ వినియోగానికే పోతిరెడ్డిపాడును విస్తరిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ ఘటనపై స్పందించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపుపై ఇప్పటి వరకు టీడీపీ తన వైఖరి వెల్లడించలేదని ఆరోపించారు. ఈ ప్రాజెక్టుపై టీడీపీ […]
దిశ ఏపీ బ్యూరో: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ‘పోతిరెడ్డిపాడు’ వార్ జరుగుతోంది. ఈ విషయంపై తెలంగాణ రాజకీయ పక్షాలు ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నాయి. తమకు కేటాయించిన జలాల సంపూర్ణ వినియోగానికే పోతిరెడ్డిపాడును విస్తరిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ ఘటనపై స్పందించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపుపై ఇప్పటి వరకు టీడీపీ తన వైఖరి వెల్లడించలేదని ఆరోపించారు. ఈ ప్రాజెక్టుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎక్కడున్నా తన వైఖరి వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ నేతలపై అంతెత్తు ఎగిరిపడే దేవినేని ఉమతో సహా టీడీపీ నేతలంతా మౌనంగా ఉండడంపై అనుమానాలున్నాయని ఆయన అన్నారు. టీడీపీ స్పందించకుంటే తమ అనుమానాలు నిజమేనని నమ్మాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.