ఏపీఎస్ఆర్టీసీలో మంత్రి వ్యాఖ్యల కలకలం

       ఆర్టీసీలో ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీ విలీనం సందర్భంగా పేర్ని నాని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయొద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎం జగన్‌తో చెప్పారని చెప్పడం రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీల్లో కలకలం రేగింది. దసరా సమయంలో తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కార్మికులు సుమారు 55 రోజుల సమ్మె చేసిన సంగతి […]

Update: 2020-02-15 03:17 GMT

ఆర్టీసీలో ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీ విలీనం సందర్భంగా పేర్ని నాని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయొద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎం జగన్‌తో చెప్పారని చెప్పడం రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీల్లో కలకలం రేగింది.

దసరా సమయంలో తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కార్మికులు సుమారు 55 రోజుల సమ్మె చేసిన సంగతి తెలిసిందే. టీఎస్ఆర్టీసీ నష్టాల్లో ఉందని, ప్రైవేటీకరణకు సమయం ఆసన్నమైందని, కొన్ని రూట్లను ప్రైవేటీకరిస్తామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. అంతే కాకుండా.. ఉద్యోగులు విధుల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారని పేర్కొని కలకలం రేపారు. ఈ వివాదం సుదీర్ఘ కాలం సాగింది. కార్మికులు బేషరతుగా విధుల్లో చేరడంతో సీఎం శాంతించారు. సమ్మె సమయంలో సీఎం కేసీఆర్‌పై కార్మికులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడినా.. ఆయన పట్టించుకోలేదు. ఆర్టీసీ సజావుగానే సాగుతోంది.

ఇంధన పొదుపు, భద్రత అవార్డులు అందించే కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని.. కేసీఆర్ ఏపీలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయొద్దని చెప్పారని చెప్పడంతో ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు అవాక్కయ్యారు. ఆర్టీసీ కార్మికుల వేతనాలు భరించడం ప్రభుత్వానికి భారమవుతుందన్నారని తెలిపారు. అయితే కేసీఆర్ వ్యాఖ్యలను సవాలుగా తీసుకున్న సీఎం జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని చెప్పారు.

Tags:    

Similar News