TTD: తిరుమలకు వెళ్లే నాయకులకు BIG అలర్ట్.. అక్కడ రాజకీయాలు మాట్లాడితే అంతే సంగతి

తిరుమల తిరుపతి దేవస్థాన(TTD) పాలకమండలి బోర్డు కీలక నిర్ణయ తీసుకుంది. టీటీడీ ధర్మకర్తల మండలి కొత్తగా కొలువు దీరిన తర్వాత తొలిసారి నేడు సమావేశమయ్యారు.

Update: 2024-11-18 10:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థాన(TTD) పాలకమండలి బోర్డు కీలక నిర్ణయ తీసుకుంది. టీటీడీ ధర్మకర్తల మండలి కొత్తగా కొలువు దీరిన తర్వాత తొలిసారి నేడు సమావేశమయ్యారు. 80 అంశాలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించారు. అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల ఆలయ పరిసరాల్లో రాజకీయాలు(Politics) మాట్లాడటంపై నిషేధం విధించారు. టీటీడీలో అన్యమత ఉద్యోగుల సేవలకు చెక్ పెట్టారు.

అంతేకాదు.. తిరుమలకు టూరిజం ప్యాకేజీలన్నీ రద్దు. శ్రీవాణి ట్రస్ట్ రద్దు. శారదాపీఠం లీజు రద్దు. శారదాపీఠం భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం. తిరుపతి ఫ్లైఓవర్‌కు గరుడ వారధి పేరు పునరుద్ధరణ. తిరుమలలో అతిథి గృహాలకు సొంత పేర్లపై నిషేధం. సర్వదర్శనం భక్తులకు 2,3 గంటల్లో దర్శనాలు అయ్యేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. గతంలో టీటీడీలో పాలన గాడి తప్పిందన్న ఆరోపణలతో ప్రక్షాళనకు శ్రీకారం చుడుతోంది.

Tags:    

Similar News