నేనే సీఎం అయితే.. చంద్రబాబు మాత్రమే మిగిలేవారు : మంత్రి పెద్దిరెడ్డి

దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రజాప్రతినిధులు అంతా రాజీనామా చేయాలన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. చంద్రబాబు వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. రాజీనామాలు చేసినంత మాత్రాన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోతుందా అని నిలదీశారు. పంచాయితీ ఎన్నికల్లో ఓడిపోయామన్న బాధతో చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో సైతం వైసీపీ 90 శాతం విజయం […]

Update: 2021-03-09 08:02 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రజాప్రతినిధులు అంతా రాజీనామా చేయాలన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. చంద్రబాబు వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. రాజీనామాలు చేసినంత మాత్రాన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోతుందా అని నిలదీశారు. పంచాయితీ ఎన్నికల్లో ఓడిపోయామన్న బాధతో చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు.

మున్సిపల్ ఎన్నికల్లో సైతం వైసీపీ 90 శాతం విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి టీడీపీలో కనీసం కొంతమంది ఎమ్మెల్యేలైనా ఉన్నారని చెప్పుకొచ్చారు. అదే తాను సీఎం అయ్యుంటే టీడీపీలో కేవలం చంద్రబాబు మాత్రమే మిగిలేవారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. మరోవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లను ఢిల్లీకి తీసుకెళ్తామని జగన్ చెప్పారని గుర్తు చేశారు. గతంలో చంద్రబాబు ఒక్కసారైనా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారా అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు.

Tags:    

Similar News