స్టీల్ ప్లాంట్ కోసం అవసరమైతే రాజీనామాలు చేస్తాం : మంత్రి మేకపాటి

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తే ఖచ్చితంగా తమ పదవులకు రాజీనామాలు చేస్తామని ఏపీ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాజీనామాలు చేసేందుకు వెనకాడబోమని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్మెంట్ కోరినట్లు మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ప్రధాని అపాయింట్మెంట్ ఇస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ పై […]

Update: 2021-03-09 07:44 GMT

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తే ఖచ్చితంగా తమ పదవులకు రాజీనామాలు చేస్తామని ఏపీ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాజీనామాలు చేసేందుకు వెనకాడబోమని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్మెంట్ కోరినట్లు మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ప్రధాని అపాయింట్మెంట్ ఇస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ పై వివరిస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఒక ఆదాయ వనరుగా చూడకుండా ఆంధ్రుల సెంటిమెంట్ గా గౌరవించాలని కోరతామన్నారు. అయినప్పటికీ కేంద్రం వైఖరిలో మార్పు లేకుంటే రాజీనామాలు చేసి ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని మంత్రి మేకపాటి గౌతం రెడ్డి స్పష్టం చేశారు.

Tags:    

Similar News