‘కార్మికులనూ దోచుకున్నారు’
దిశ, వెబ్‌డెస్క్: ఈఎస్ఐ కుంభకోణంపై మంత్రి గుమ్మునూరు జయరాం స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వం కార్మికులనూ దోచుకుందని మండిపడ్డారు. టీడీపీ హయాంలోనే ఈఎస్ఐలో భారీ అవినీతి జరిగిందనీ, దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించామని వెల్లడించారు. దాని నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అక్రమంగా చెల్లించిన బిల్లుల సొమ్ము రికవరీ చేస్తామని వెల్లడించారు. అవినీతికి పాల్పడిన వారెవ్వరినీ వదిలిపెట్టబోమని తేల్చిచెప్పారు. కాగా, తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ ఈఎస్ఐలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. గడిచిన […]
దిశ, వెబ్‌డెస్క్: ఈఎస్ఐ కుంభకోణంపై మంత్రి గుమ్మునూరు జయరాం స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వం కార్మికులనూ దోచుకుందని మండిపడ్డారు. టీడీపీ హయాంలోనే ఈఎస్ఐలో భారీ అవినీతి జరిగిందనీ, దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించామని వెల్లడించారు. దాని నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అక్రమంగా చెల్లించిన బిల్లుల సొమ్ము రికవరీ చేస్తామని వెల్లడించారు. అవినీతికి పాల్పడిన వారెవ్వరినీ వదిలిపెట్టబోమని తేల్చిచెప్పారు. కాగా, తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ ఈఎస్ఐలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. గడిచిన ఆరేండ్లలో సుమారు రూ.100కోట్ల అవినీతి జరిగినట్టు అధికారులు గుర్తించారు.