మంత్రి బొత్స ఇంట విషాదం!
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట విషాదం నెలకొన్నది. ఆయన తల్లి ఈశ్వరమ్మ మరణించినట్లు తెలిసింది. గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. మంత్రి తల్లి మరణ వార్త విన్న పలువురు రాజకీయ ప్రముఖులు, ఇతర ప్రముఖులు బొత్స కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.