2021 వరకు పోలవరం పూర్తి చేస్తాం

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌తో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీలు మిథున్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, లావు కృష్ణ దేవరాయలు సోమవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. పోలవరం బకాయిలు, పునరావాసం ప్యాకేజీ నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ నిధులు రెండు మూడు రోజుల్లో విడుదల చేస్తామని వెల్లడించినట్లు తెలిపారు. పోలవరం పనులను సీఎం జగన్ యజ్ఞంలా నిర్వహిస్తున్నారని, 2021డిసెంబర్‌ వరకు పోలవరం ప్రాజెక్ట్ […]

Update: 2020-09-21 08:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌తో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీలు మిథున్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, లావు కృష్ణ దేవరాయలు సోమవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. పోలవరం బకాయిలు, పునరావాసం ప్యాకేజీ నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ నిధులు రెండు మూడు రోజుల్లో విడుదల చేస్తామని వెల్లడించినట్లు తెలిపారు. పోలవరం పనులను సీఎం జగన్ యజ్ఞంలా నిర్వహిస్తున్నారని, 2021డిసెంబర్‌ వరకు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలనేది సీఎం లక్ష్యమన్నారు. కృష్ణా నదిపై నిర్మించే ప్రాజెక్టులతో రాయలసీమకు ఎలాంటి లాభం ఉంటుందో వివరించినట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News