హైదరాబాద్‌లో ఉంటూ ఏపీలో చౌకబారు రాజకీయాలా?

దిశ, ఏపీ బ్యూరో: స్త్రీని శక్తీ స్వరూపిణిగా పూజిస్తాం… పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 78 లక్షల మందికి రూ. 6,440 కోట్లు రెండో విడత వైఎస్సార్ ఆసరా సీఎం అందించారు. చంద్రబాబు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని అక్కాచెల్లెమ్మలను మోసం చేశారు. అప్పటి బకాయిలు రూ. 25 వేల కోట్లను 4 విడతల్లో చెల్లిస్తానని సీఎం వైఎస్ జగన్ మాట ఇచ్చారు. రెండు విడతల్లో రూ.12,700 కోట్లు నేరుగా అకౌంట్‌కే జమ చేశారు అని మంత్రి అనిల్ […]

Update: 2021-10-12 03:56 GMT

దిశ, ఏపీ బ్యూరో: స్త్రీని శక్తీ స్వరూపిణిగా పూజిస్తాం… పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 78 లక్షల మందికి రూ. 6,440 కోట్లు రెండో విడత వైఎస్సార్ ఆసరా సీఎం అందించారు. చంద్రబాబు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని అక్కాచెల్లెమ్మలను మోసం చేశారు. అప్పటి బకాయిలు రూ. 25 వేల కోట్లను 4 విడతల్లో చెల్లిస్తానని సీఎం వైఎస్ జగన్ మాట ఇచ్చారు. రెండు విడతల్లో రూ.12,700 కోట్లు నేరుగా అకౌంట్‌కే జమ చేశారు అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. మహిళలను అప్పుల ఊబిలోనుంచి బయటకు తీసుకురావాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఆలోచన అని చెప్పుకొచ్చారు. మహిళా సాధికారత కోసం సీఎం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని.. చంద్రబాబు మాత్రం సున్నా వడ్డీ పథకాన్ని కూడా నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. ఆ అప్పు రూ. 3000 వేల కోట్ల భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తోందని వెల్లడించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మహిళలకు ఒక్క ఇల్లు కూడా ఉచితంగా ఇవ్వలేదన్నారు.

టిడ్కో ఇళ్ల పేరుతో ఋణభారం మోపాలని ప్రయత్నించారని..చివరికి వాటిని కూడా సీఎం వైఎస్ జగన్ ఒక్క రూపాయికే లబ్ధిదారులకు అందజేస్తున్నారని స్పష్టం చేశారు. అందుకు అయ్యే రూ.4 వేల కోట్ల భారాన్ని కూడా తమ ప్రభుత్వమే భరిస్తోందని పేర్కొన్నారు. ఆడపడుచులకు ఆస్తి ఇవ్వాలన్న సంకల్పంతో 31 లక్షల మంది అక్కాచెల్లెమ్మలకు ఇంటి పట్టాలు అందజేశారని గుర్తు చేశారు. ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయని స్పష్టం చేశారు. అయితే వాటిని కూడా అడ్డుకునేందుకు చంద్రబాబు నీచమైన స్థితికి దిగజారారని మండిపడ్డారు. దొంగచాటుగా కోర్టుల కెక్కి అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. మహిళాభివృద్ధిని అడ్డుకొంటున్న చంద్రబాబుని అనుబంధ పార్టీలు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. హైదరాబాద్‌లో ఉంటూ అప్పుడుడప్పుడూ వచ్చి చంద్రబాబు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

AP Minister Anil Fires on Ex CM Chandhrababu

Tags:    

Similar News