మేయర్ అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం జగన్

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మేయర్ అభ్యర్థుల జాబితా దాదాపుగా ఖరారు అయ్యింది. రెండు రోజులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రులు, పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యారు. చివరికి బుధవారం అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మచిలీపట్నం కార్పొరేషన్ మినహా అన్ని కార్పొరేషన్లకు అభ్యర్థులను ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. అనంతపురం-మహమ్మద్ వసీం సలీం గుంటూరు-కావటి మనోహర్ నాయుడు మరియు రమేష్ గాంధీ కడప-సురేశ్ బాబు తిరుపతి- శిరీష చిత్తూరు- ఎస్ ఆముద విజయవాడ- భాగ్యలక్ష్మి ఒంగోలు- సుజాత […]

Update: 2021-03-17 05:18 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మేయర్ అభ్యర్థుల జాబితా దాదాపుగా ఖరారు అయ్యింది. రెండు రోజులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రులు, పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యారు. చివరికి బుధవారం అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మచిలీపట్నం కార్పొరేషన్ మినహా అన్ని కార్పొరేషన్లకు అభ్యర్థులను ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది.
అనంతపురం-మహమ్మద్ వసీం సలీం
గుంటూరు-కావటి మనోహర్ నాయుడు మరియు రమేష్ గాంధీ
కడప-సురేశ్ బాబు
తిరుపతి- శిరీష
చిత్తూరు- ఎస్ ఆముద
విజయవాడ- భాగ్యలక్ష్మి
ఒంగోలు- సుజాత
గ్రేటర్ విశాఖపట్నం- హరివెంకట కుమారి
విజయనగరం- విజయలక్ష్మి
మచిలీపట్నం కార్పొరేషన్ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ఆశావాహులు సంఖ్య విపరీతంగా ఉన్న నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై గందరగోళం నెలకొంది. ఇకపోతే ఏలూరు కార్పొరేషన్ కి ఎన్నిక జరిగినప్పటికీ హైకోర్టు ఫలితాలను వెల్లడించొద్దని ఆదేశించింది. దీంతో ఏలూరు రిజల్ట్స్ కి బ్రేక్ లు పడ్డాయి. ఇకపోతే మేయర్ అభ్యర్థుల జాబితాను బుధవారం సాయంత్రం 6 గంటలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణలు ప్రకటించనున్నారు.

 

Tags:    

Similar News