ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదలైంది. మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. మొదటి విడుతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 9 నుంచి 11 వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్ధానాలకు నామినేషన్ల స్వీకరించనున్నారు. 21న పోలింగ్, 29న కౌటింగ్ చేపట్టనున్నారు. రెండో దశలో మున్సిపాలిటీలకు 23న పోలింగ్, 27న కౌటింగ్ జరగనుంది. ఇక పంచాయతీ ఎన్నికలకు 17 నుంచి 19 వరకూ […]

Update: 2020-03-07 01:05 GMT

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదలైంది. మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. మొదటి విడుతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 9 నుంచి 11 వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్ధానాలకు నామినేషన్ల స్వీకరించనున్నారు. 21న పోలింగ్, 29న కౌటింగ్ చేపట్టనున్నారు. రెండో దశలో మున్సిపాలిటీలకు 23న పోలింగ్, 27న కౌటింగ్ జరగనుంది.
ఇక పంచాయతీ ఎన్నికలకు 17 నుంచి 19 వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు. 27న మొదటి దశ సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఏ గ్రామ పంచాయతీకి ఎప్పుడు ఎన్నికలు నిర్వహించేది కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారని ఎన్నికల కమిషనర్ తెలిపారు. 29న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని కమిషనర్ తెలిపారు.

Tags: local body election, schedule, notification, release

Tags:    

Similar News