ఏపీ జిల్లా పరిషత్తు నామినేషన్లు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 652 జిల్లా పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలకు 4,778 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు ఆరంభమైన మార్చి 9వ తేదీన 68 మంది, 10వ తేదీన 355 మంది నామినేషన్లు దాఖలు చేయగా, నిన్న ఒక్కరోజే 4355 మంది నామినేషన్లు దాఖలు చేయడం విశేషం. నామినేషన్ల వివరాల్లోకి వెళ్తే.. 1) శ్రీకాకుళం జిల్లాలోని 38 జిల్లా పరిషత్ స్థానాలకుగాను 281 నామినేషన్లు దాఖలయ్యాయి. 2) విజయనగరం జిల్లాలో 34 జిల్లా పరిషత్ […]
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 652 జిల్లా పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలకు 4,778 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు ఆరంభమైన మార్చి 9వ తేదీన 68 మంది, 10వ తేదీన 355 మంది నామినేషన్లు దాఖలు చేయగా, నిన్న ఒక్కరోజే 4355 మంది నామినేషన్లు దాఖలు చేయడం విశేషం. నామినేషన్ల వివరాల్లోకి వెళ్తే..
1) శ్రీకాకుళం జిల్లాలోని 38 జిల్లా పరిషత్ స్థానాలకుగాను 281 నామినేషన్లు దాఖలయ్యాయి.
2) విజయనగరం జిల్లాలో 34 జిల్లా పరిషత్ స్థానాలకుగాను 241 నామినేషన్లు దాఖలయ్యాయి.
3) విశాఖపట్నం జిల్లాలోని 39 జిల్లా పరిషత్ స్థానాలకుగాను 296 నామినేషన్లు దాఖలయ్యాయి.
4) తూర్పుగోదావరి జిల్లాలోని 61 జిల్లా పరిషత్ స్థానాలకుగాను 482 నామినేషన్లు దాఖలయ్యాయి.
5) పశ్చిమగోదావరి జిల్లాలోని 48 జిల్లా పరిషత్ స్థానాలకుగాను 370 నామినేషన్లు దాఖలయ్యాయి.
6) కృష్ణా జిల్లాలోని 46 జిల్లా పరిషత్ స్థానాలకుగాను 331 నామినేషన్లు దాఖలయ్యాయి.
7) గుంటూరు జిల్లాలోని 54 జిల్లా పరిషత్ స్థానాలకుగాను 388 నామినేషన్లు దాఖలయ్యాయి.
8) ప్రకాశం జిల్లాలోని 55 జిల్లా పరిషత్ స్థానాలకుగాను 394 నామినేషన్లు దాఖలయ్యాయి.
9) నెల్లూరు జిల్లాలోని 46 జిల్లా పరిషత్ స్థానాలకుగాను 330 నామినేషన్లు దాఖలయ్యాయి.
10) కర్నూలు జిల్లాలోని 53 జిల్లా పరిషత్ స్థానాలకుగాను 351 నామినేషన్లు దాఖలయ్యాయి.
11) అనంతపురం జిల్లాలోని 63 జిల్లా పరిషత్ స్థానాలకుగాను 474 నామినేషన్లు దాఖలయ్యాయి.
12) చిత్తూరు జిల్లాలోని 65 జిల్లా పరిషత్ స్థానాలకుగాను 480 నామినేషన్లు దాఖలయ్యాయి.
13) కడప జిల్లాలోని 50 జిల్లా పరిషత్ స్థానాలకుగాను 341 నామినేషన్లు దాఖలయ్యాయి.
Tags: zp elections, nominations, 13 districts nomination, local body elections