కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదు: ఛైర్మన్ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై దాగుడుమూతలాట ఇంకా ఒక కొలిక్కి రాలేదు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏను రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ ఆమోదించిన బిల్లును శాసన మండలికి పంపిన సంగతి తెలిసిందే. దీనిపై శాసనమండలిలో చర్చించిన మండలి ఛైర్మన్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారు. సెలెక్ట్ కమిటీలకు సభ్యులను శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ ఖరారు కూడా చేశారు. కమిటీని ఏర్పాటు చేసి తనకు నివేదించాలని శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ […]
ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై దాగుడుమూతలాట ఇంకా ఒక కొలిక్కి రాలేదు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏను రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ ఆమోదించిన బిల్లును శాసన మండలికి పంపిన సంగతి తెలిసిందే. దీనిపై శాసనమండలిలో చర్చించిన మండలి ఛైర్మన్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారు. సెలెక్ట్ కమిటీలకు సభ్యులను శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ ఖరారు కూడా చేశారు. కమిటీని ఏర్పాటు చేసి తనకు నివేదించాలని శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ శాసనసభ కార్యదర్శిని ఆదేశించారు. అయితే నిబంధనల ప్రకారం ఈ కమిటీల ఏర్పాటు కుదరదంటూ సంబంధిత దస్త్రాన్ని శాసనసభ కార్యదర్శి శాసనమండలి ఛైర్మన్‌కు తిప్పి పంపారు. దీనిపై షరీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేసి తనకు నివేదించాలని మరోసారి ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఇంకా ఆలస్యం చేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించినట్టు తెలుస్తోంది.