దేశంలో ఏపీది నాలుగో స్థానం
కరోనా వైరస్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తోంది. కరోనా వ్యాప్తి నిరోధానికి సామాజిక దూరం చాలా ముఖ్యమని ప్రపంచ, భారత వైద్య ఆరోగ్య సంస్థలు సూచించడంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు నిపుణులు సామాజిక దూరం కంటే కరోనా టెస్టులు నిర్వహించడం చాలా ముఖ్యమని, పరీక్షల నిర్వహణ ఆలస్యమయ్యే కొద్దీ ముప్పు కొనితెచ్చుకున్నట్టేనని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని రాష్ట్రాలన్నీ కరోనా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాయి. టెస్టు కిట్లు తయారు […]
కరోనా వైరస్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తోంది. కరోనా వ్యాప్తి నిరోధానికి సామాజిక దూరం చాలా ముఖ్యమని ప్రపంచ, భారత వైద్య ఆరోగ్య సంస్థలు సూచించడంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు నిపుణులు సామాజిక దూరం కంటే కరోనా టెస్టులు నిర్వహించడం చాలా ముఖ్యమని, పరీక్షల నిర్వహణ ఆలస్యమయ్యే కొద్దీ ముప్పు కొనితెచ్చుకున్నట్టేనని హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో దేశంలోని రాష్ట్రాలన్నీ కరోనా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాయి. టెస్టు కిట్లు తయారు చేసే కార్యక్రమంలో మునిగిపోయాయి. ఏపీ ఆర్థిక రాజధాని విశాఖపట్టణంలోని మెడ్‌టెక్ జోన్‌లో కోవిడ్ 19 టెస్ట్ కిట్స్ తయారవుతున్నాయి. అదే సమయంలో చైనా నుంచి భారీ ఎత్తున కరోనా టెస్టు కిట్లను ఏపీ దిగుమతి చేసుకుంది. రోజూ నాలుగు వేల మందికి కరోనా పరీక్షలు చేస్తోంది.
దీంతో కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచిందని వైఎస్సార్సీపీ ట్విట్టర్ పేజీలో తెలిపింది. దేశంలో సగటున 10 లక్షల మందికి 198 పరీక్షలు చేస్తుంటే.. ఏపీలో 331 టెస్టులు చేస్తున్నారని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. రాష్ట్రంలో రోజుకు 3వేలకు పైగా పరీక్షలు చేస్తున్నారని, ఇప్పటివరకు మొత్తంగా 16,550 మందికి పరీక్షలు నిర్వహించారని తెలిపింది.
ఈ జాబితాలో అగ్రస్థానంలో వున్న రాజస్థాన్‌లో పది లక్షల జనాభాకు సగటున 549 పరీక్షలు చేస్తున్నారు. ఏడు కోట్ల జనాభా ఉన్న ఆ రాష్ట్రంలో ఇప్పటిదాకా 37,860 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. రెండో ర్యాంకులో నిలిచిన కేరళలో సగటున 485 మందికి పరీక్షలు చేయగా.. మొత్తంగా 16,475 మందికి టెస్టు చేశారు. మూడో స్థానంలో ఉన్న మహారాష్ట్రలో సగటు 446గా ఉండగా.. ఆ రాష్ట్రంలో ఇప్పటిదాకా 50,850 మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారంటూ టేబుల్‌ను పోస్టు చేసింది.
tags: ysrcp, twitter, 4th place, corona virus tests, andhrapradesh,