స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..
దిశ, ఏపీబ్యూరో : స్థానిక ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం నుంచి మూడు రోజుల లోపు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డను కలవాలని ఆదేశించింది. ప్రభుత్వ అభిప్రాయాన్ని వివరించి చెప్పాలని స్పష్టం చేసింది. చర్చలు జరపాలని గతంలోనే ఆదేశాలు ఇచ్చిన న్యాయస్థానం.. ఈసారి మూడు రోజుల డెడ్‌లైన్ విధించింది. స్థానిక ఎన్నికలపై ప్రభుత్వ పిటిషన్‌ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను వెల్లడించింది. ఎస్ఈసీతో […]
దిశ, ఏపీబ్యూరో : స్థానిక ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం నుంచి మూడు రోజుల లోపు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డను కలవాలని ఆదేశించింది. ప్రభుత్వ అభిప్రాయాన్ని వివరించి చెప్పాలని స్పష్టం చేసింది. చర్చలు జరపాలని గతంలోనే ఆదేశాలు ఇచ్చిన న్యాయస్థానం.. ఈసారి మూడు రోజుల డెడ్‌లైన్ విధించింది. స్థానిక ఎన్నికలపై ప్రభుత్వ పిటిషన్‌ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను వెల్లడించింది.
ఎస్ఈసీతో చర్చల ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించింది. హైకోర్టు ఆర్డర్ కాపీ అందిన వెంటనే మూడు రోజుల్లోపు ముగ్గురు అధికారులను ఎన్నికల కమిషన్ వద్దకు పంపాలని, ఇందుకోసం ఎన్నికల కమిషన్ వేదికను నిర్ణయించాలని ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వం తమ అభ్యంతరాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది. ఇంత త్వరగా స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరాన్ని ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి వివరించాలని చెప్పింది. కోర్టు ఉత్తర్వులు బుధవారం ఉదయంలోపు వెలువడే అవకాశముంది.