ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన..

దిశ, వెబ్‌డెస్క్ : రాగల మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో రుతుపవనాలు ఏపీ, తెలంగాణలో పూర్తిగా విస్తరించనున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో రుతుపవనాలు ఇప్పటివరకు మెదక్‌, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలలో మాత్రమే ప్రవేశించాయి. మరోవైపు మరఠ్వాడా నుంచి ఉత్తర కర్ణాటక వరకు సముద్రమట్టానికి ఒకటిన్నర కిలోమీటర్‌ వరకు ఏర్పడిన ద్రోణి బలహీనపడింది. అయితే ఈ నెల […]

Update: 2021-06-08 20:56 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రాగల మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో రుతుపవనాలు ఏపీ, తెలంగాణలో పూర్తిగా విస్తరించనున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో రుతుపవనాలు ఇప్పటివరకు మెదక్‌, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలలో మాత్రమే ప్రవేశించాయి. మరోవైపు మరఠ్వాడా నుంచి ఉత్తర కర్ణాటక వరకు సముద్రమట్టానికి ఒకటిన్నర కిలోమీటర్‌ వరకు ఏర్పడిన ద్రోణి బలహీనపడింది. అయితే ఈ నెల 11న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నందున రుతుపవనాలు వేగం పుంజుకోవచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ కారణంగా కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని వెల్లడించింది.

 

Tags:    

Similar News