పశ్చిమగోదావరి జిల్లా వింత జబ్బు వెనుక విపక్షాల కుట్ర
దిశ,వెబ్‌డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా వింత వ్యాధిపై ఆళ్ల నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాలయాల్లో విగ్రహాల విధ్వంసం రాజకీయనాయకుల హస్తం ఉందని తేలింది. అదే తరహాలో వింత వ్యాధిపై అనుమానాలున్నాయని అన్నారు. రాజకీయం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని కోరారు. పశ్చిమగోదావరి జిల్లాలో వింత వ్యాధి పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం, కొమిరేపల్లిని వింత వ్యాధి భయాందోళనకు గురిచేస్తోంది. వింత వ్యాధి కారణంగా ఇప్పటి వరకు 13 మంది అస్వస్థతకు గురైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు […]
దిశ,వెబ్‌డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా వింత వ్యాధిపై ఆళ్ల నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాలయాల్లో విగ్రహాల విధ్వంసం రాజకీయనాయకుల హస్తం ఉందని తేలింది. అదే తరహాలో వింత వ్యాధిపై అనుమానాలున్నాయని అన్నారు. రాజకీయం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని కోరారు.
పశ్చిమగోదావరి జిల్లాలో వింత వ్యాధి
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం, కొమిరేపల్లిని వింత వ్యాధి భయాందోళనకు గురిచేస్తోంది. వింత వ్యాధి కారణంగా ఇప్పటి వరకు 13 మంది అస్వస్థతకు గురైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు పూళ్లలోనూ వింతవ్యాధి సోకిన బాధితుల సంఖ్య పెరుగుతున్నాయి. ఉన్నట్లుండి పడిపోవడం, పిట్స్‌లు రావడంతో అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే ఈ వింత వ్యాధిపై ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పరిస్థితిని దగ్గరుండి సమీక్షిస్తున్నారు. కాగా ఇప్పటి వరకు భీమడోలు మండలంలో వింతవ్యాధి బాధితుల సంఖ్య 38కి చేరింది.
వింత వ్యాధిలో విపక్షాల కుట్ర
గతేడాది డిసెంబర్ 5న 2లక్షల మంది జనాభా పైగా ఉన్న ఏలూరులో ఈ వింత వ్యాధి వెలుగులోకి వచ్చింది. దీంతో ఆరోగ్యశాఖ అధికారులు వైద్య పరీక్షలు చేయగా అందులో 615మందికి వ్యాధి లక్షణాలున్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు జాతీయ అంతర్జాతీయ స్థాయికి చెందిన వైద్యుల పర్యవేక్షణలో పశ్చిగోదావరి జిల్లాకు చెందిన నీరు, ఫుడ్, కూరగాయలతో పాటు వ్యాధి బారిన పడుతున్న బాధితుల నుంచి శాంపిల్స్ తీసుకున్నా ఆ టెస్ట్‌ల్లో వ్యాధి గురించి ఎలాంటి అనుమానాలు తలెత్తలేదు. అయితే తాజాగా జనవరి 7నుంచి ఇప్పటి వరకు కొమిరేపల్లి, పూళ్లలో వింత వ్యాధి కేసులు వెలుగులోకి రావడంపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని అనుమానం వ్యక్తం చేశారు. ఇన్ని లక్షల జనాభాలో ఏలూరుకు చెందిన పలు గ్రామాల్లో అక్కడక్కడ కొంతమందిబాధితుల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించడంపై ప్రజలతో పాటు అధికారులు పలు అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా రాజకీయం కోసం కుట్రలు చేస్తున్నారేమోనన్న అనుమానాలు ఉన్నాయని, అందుకు పెద్ద ఎత్తున విచారణ చేపట్టాల్సి ఉందని స్పష్టం చేశారు.
ఫిర్యాదులు అందితే విచారణ చేపడతాం
మరోవైపు జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ సైతం..,వ్యాధి గురించి జిల్లా, రాష్ట్రస్థాయి ఆరోగ్యశాఖ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా విచారణ చేపడతామన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని గ్రామాలకు చెందిన బాధితుల నుంచి వివరాల్ని సేకరిస్తున్నట్లు చెప్పారు. లా అండ్ ఆర్డర్ ప్రకారం వ్యాధి గురించి ఎవరైనా ఫిర్యాదు చేసినా తప్పని సరిగా విచారణ చేస్తామని ఏలూరు జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ స్పష్టం చేశారు.