అమరావతి మెట్రో రైల్ పేరు మార్చిన ఏపీ
ఏపీలోని వైఎస్సార్సీపీ గవర్నమెంట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరును ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్టణంలో తలపెట్టిన మెట్రోకు కూడా అమరావతి పేరే ఉండడంతో ప్రాజెక్టు పేరును మార్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో వివరించింది. ఇది విమర్శలకు గురి కాకుండా ఉండేందుకు గాను, గతంలో నాగ్‌పూర్ మెట్రో ప్రాజెక్టు పేరును మహారాష్ట్ర మెట్రో రైల్ ప్రాజెక్టు […]
ఏపీలోని వైఎస్సార్సీపీ గవర్నమెంట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరును ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్టణంలో తలపెట్టిన మెట్రోకు కూడా అమరావతి పేరే ఉండడంతో ప్రాజెక్టు పేరును మార్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో వివరించింది. ఇది విమర్శలకు గురి కాకుండా ఉండేందుకు గాను, గతంలో నాగ్‌పూర్ మెట్రో ప్రాజెక్టు పేరును మహారాష్ట్ర మెట్రో రైల్ ప్రాజెక్టు లిమిటెడ్‌గా మార్చినట్టు గుర్తు చేసింది. అలాగే, లక్నో మెట్రో ప్రాజెక్ట్ పేరును ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లిమిటెడ్‌గా మార్చారని తెలిపుతూ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టనున్న మెట్రో ప్రాజెక్టుల సౌలభ్యం కోసమే పేరు మార్చినట్టు ప్రభుత్వం వెల్లడించింది.
Tags: ys jagan, apmrcl, ap metrorail corporation limited, amaravathi,metrorail corporation limited, name changed