వారికి ఏపీ గవర్నర్ అభినందనలు

దిశ, ఏపీ బ్యూరో: తొలి ఆన్‌లైన్ ఫిడే చెస్ ఒలింపియాడ్ ఛాంపియన్‌షిప్‌ను రష్యాతో కలిసి సంయిక్తంగా గెలుచుకున్న భారత జట్టుకు సోమవారం ఓ ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రతిష్టాత్మక ఫిడే ఆన్‌లైన్ ఒలింపియాడ్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నందుకు విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి, ద్రోణవిల్లి హారిక, హరి కృష్ణ, దివ్య, నిహాల్, విదిత్‌లతో కూడిన భారత జట్టుకు గవర్నర్ శ్రీ హరిచందన్ తన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు తేజం కోనేరు […]

Update: 2020-08-31 06:52 GMT

దిశ, ఏపీ బ్యూరో: తొలి ఆన్‌లైన్ ఫిడే చెస్ ఒలింపియాడ్ ఛాంపియన్‌షిప్‌ను రష్యాతో కలిసి సంయిక్తంగా గెలుచుకున్న భారత జట్టుకు సోమవారం ఓ ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రతిష్టాత్మక ఫిడే ఆన్‌లైన్ ఒలింపియాడ్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నందుకు విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి, ద్రోణవిల్లి హారిక, హరి కృష్ణ, దివ్య, నిహాల్, విదిత్‌లతో కూడిన భారత జట్టుకు గవర్నర్ శ్రీ హరిచందన్ తన శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు తేజం కోనేరు హంపి మెరుగైన ఆటతీరును ప్రదర్శించటం తెలుగు వారందరికీ గర్వకారణమని, ఈ విజయం భారతీయులందరినీ గర్వపడేలా చేసిందని గవర్నర్ పేర్కొన్నారు. భారత జట్టు ప్రదర్శించిన ఆటతీరుతో భారత దేశానికి ఈ గౌరవం దక్కిందని, భవిష్యత్తులో సైతం భారత బృందం మంచి ఆటతీరును ప్రదర్శిస్తూ మరిన్ని విజయాలను కైవసం చేసుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు.

Tags:    

Similar News