హైకోర్టులో పిటిషన్ వాపస్ తీసుకున్న ఏపీ

దిశ, ఏపీ బ్యూరో: ఆంధప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తిరిగి విధుల్లో చేర్చుకోవాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలుపై స్టే కోరుతూ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. ఈ మేరకు అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఎస్ఈసీగా తిరిగి నియమించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలుపై స్టే కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్‌ వేసినందున హైకోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్టు ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. మరోవైపు, నిమ్మగడ్డ […]

Update: 2020-06-02 05:04 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆంధప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తిరిగి విధుల్లో చేర్చుకోవాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలుపై స్టే కోరుతూ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. ఈ మేరకు అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఎస్ఈసీగా తిరిగి నియమించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలుపై స్టే కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్‌ వేసినందున హైకోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్టు ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. మరోవైపు, నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ కేసులో సుప్రీంకోర్టులో బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. తమ పార్టీ అధిష్టానం అనుమతితోనే తాను ఈ పిటిషన్ వేశానని ఆయన తెలిపారు.

Tags:    

Similar News